రాహుకాల దీపం అంటే నిమ్మకాయ దీపమని పిలుస్తారు. ఇది దుర్గమ్మకు మాత్రమే పెట్టేటటువంటి దీపం. దుర్గాదేవి టెంపుల్స్ లో మాత్రమే వెలిగించేటటువంటి దీపం. కర్మానుసారంగా మనం చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం.

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబానికి సంబంధించి, బంధాలకు సంబంధించి, ఎన్నో రకాల సమస్యలనేవి మనని పట్టిపీడిస్తూ ఉంటవి. అన్నిటికీ ఏకైక పరిష్కార మార్గంగా అమ్మవారు పిలిస్తే పలికేటువంటి ఈ ఒక్క దీపం వెలిగించి, కొన్నీ వారాలపాటు మొక్కుకొని టెంపుల్లో ఎవరైతే వెలిగిస్తారు.

అసలు ఇది వెలిగించిన తర్వాత తీరనటువంటి కోరిక ఉండదు. పిల్లల చదువులు కావచ్చు, వివాహం సంతానం ఆరోగ్యం ఒకటి రెండు అనే కాకుండా మనకు ఎన్ని సమస్యలు ఉంటాయో, అన్ని సమస్యలకి ఏకైక పరిష్కార మార్గం రాహుకాల దీపం. అది వెలిగించి అత్యంత శక్తివంతంగా మనకు ప్రభావాన్ని చూపించేటటువంటి సమయం, ప్రస్తుతం ఉండేటటువంటి దేవీ నవరాత్రుల సమయం.

ఈ నిమ్మకాయ దీపానికి కావలసింది నిమ్మకాయలు ఇవి రెండు దీపాలు పెట్టొచ్చు, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, 21, 11 ఇలా ఎన్ని దీపాలైన మన శక్తానుసారం పెట్టుకోవచ్చు. మొక్కుకున్న తీరును బట్టి కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క రాహుకాల దీపాన్ని పెట్టుకోగలిగితే,

చాలా సందర్భాల్లో మనం అనుకున్న విధంగా నవరాత్రి పూజలు చేయలేని వారు, ఎవ్వరైనా కూడా ప్రతిరోజు నవరాత్రులు మొత్తం కూడా దుర్గాదేవి శక్తి స్వరూపిణి అయినటువంటి టెంపుల్స్ లో మాత్రమే పెట్టాలి. పార్వతి దుర్గా ఉమా గ్రామ దేవతలు వీరి టెంపుల్స్ లో మాత్రమే పెట్టాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.