ఉల్లిపాయ సాధారణంగా వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే జాతికి చెందినది.

తెల్ల ఉల్లిపాయ రసాన్ని నాలుగు నుండి ఆరు టీస్పూన్ల మోతాదులో రోజుకు రెండు లేదా మూడుసార్లు వాడితే శరీరం లోపల జరిగే అంతర్గత రక్తస్రావాలు తగ్గుతాయి. తెల్ల ఉల్లిపాయ ముక్కలను మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నా చక్కని గుణం కనిపిస్తుంది.

నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి ఒక చిటికెడు ఇంగువ పొడిని, ఒక చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.ఉల్లి రసానికి తగినంత తేనె కలిపి కంట్లో చుక్కల మందుగా వేసుకుంటూ ఉంటే కంటి చూపు పెరుగుతుంది.

ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పును కలిపి అవసరాన్ని బట్టి రెండు లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే కడుపునొప్పి తగ్గుతుంది.ఒకటి నుండి రెండు ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.

రెండు నుండి నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని రోజుకు మూడు లేదా నాలుగుసార్లు మూడు నెలలపాటు తాగితే మూత్రపిండాల నొప్పి, పొత్తికడుపులో నొప్పి, పేగులలో పురుగులు, మూత్ర వ్యవస్థలో రాళ్లు తయారవటం వంటి అన్ని సమస్యలు తగ్గుతాయి.ఒకటి లేదా రెండు తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను సమభాగాలుగా కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున మూడు పూటలా తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.