ఈనెల 23న ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో శక్తివంతమైన పరమ పవిత్రమైన రోజు, ఈ భూమి మీద ముక్కోటి దేవతలు ఉండే,

ఈ రోజు ఉపవాసం చేసి, దేవుడికి దగ్గరగా ఉంటే కలిగే ఫలితాన్ని వర్ణించడం ఎవరితరం కాదు. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే, అన్ని ఏకాదశి లకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఈరోజు ఒకవేళ ఉపవాసం చేయలేని వారు,

కుదరని వారు ఏం చేసే అంతటి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు, బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం స్వయంపాకం ఇవ్వడం లేదా ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వడం వల్ల, ఉపవాసం చేసిన ఫలం దక్కుతుంది. అలానే ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు,

దశమి నాటే రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారం తినాలి. ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. పండ్లు, పండ్ల రసాలు పాలు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. జాగరణ కూడా దైవ నామస్మరణతో భజనలతో గడపాలి. ఇక ద్వాదశి రోజు ఉదయం పారన చేయాలి. పారణ అంటే దైవరాధన తర్వాత మీరు భోజనం చేయాలి.

ఇక మీరు ఇలా భోజనం చేసే ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్ర పోకూడదు. అలానే ద్వాదశి రోజు రాత్రి ఆహారం తినకూడదు. అల్పాహారం తినాలి ఇది ముక్కోటి ఏకాదశి ఉపవాస నియమం. కానీ వాయు పురాణం ఇలా చెబుతుంది. ఇలా ఉపవాసం పూర్తిగా చేయలేని వారు రాత్రి జాగరణ చేయలేని వారు, ఏం చేస్తే అంతటి ఫలితం కలుగుతుందో, వాయు పురాణంలో ఇలా వివరణ ఉంది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.