ఆప్టికల్ ఇల్యూషన్ అంటే తెలుసా మీకు.. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేది ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టెక్నిక్. దాన్ని మనం తెలుగులో బ్రాంతి అని అంటాము. ఆప్టికల్ ఇల్యూషన్ మీద ఇప్పటికే చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

త్రీడీ ఫోటోను చూపించి, మధ్యలో ఒక చుక్క పెట్టి దాన్ని చూస్తూ ఉండండి తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఫోటోలని మనం రోజూ చూస్తూనే ఉంటాం..

తాజాగా సోషల్ మీడియాలో ఒక షూ వైరల్ గా మారింది, ఏంటి ఆ షూ స్పెషాలిటీ అంటారా, ఆప్టికల్ ఇల్యూషన్ షూ కొందరికి ఆ షూ ఒక కలర్ లో కనిపిస్తే, మరి కొందరికి మరో కలర్ లో కనిపిస్తుంది. మీరు ఎప్పుడో చూస్తున్నారు కదా షూ ఆ షూ గురించి మనం మాట్లాడుకునేది. అ షూ లైఫ్ స్టైల్ ఫేస్బుక్ లో, గత వారం పోస్ట్ చేశారు. చాలా మందికి ఆ ఫోటో బూడిద రంగు లేదా, ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. మరి కొందరికి మాత్రం పింక్, వైట్ కలర్ లో కనిపిస్తుంది. అయితే కొందరికి ఒక రంగులో మరి కొందరికి మరో రంగులో కనిపించడానికి కారణం కూడా వివరించారు. మనిషి మెదడులో రెండు భాగాలు ఉంటాయి, తెలుసు కదా ఒకటి రైట్ బ్రెయిన్, రెండోది లెఫ్ట్. రైట్ బ్రెయిన్ డామినేట్ చేసే వాళ్ళకి అ షూ వైట్ కలర్ లో, కనిపిస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ డామినేట్ చేసే వాళ్ళకి అది గ్రీన్ కలర్ లో కనిపిస్తుందట.

చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఆ పోస్ట్ ఫేస్బుక్ లో షేర్ చేయగానే చాలామంది తమ కళ్ళకు పరీక్ష పెట్టారు. తమకు ఏ కలర్ కనిపించిందో కామెంట్ లో పెట్టాలి అంటే కొందరు పింక్ వైట్, అని మరి కొందరు గ్రే గ్రీన్ కలర్ లో కనిపించిందని కామెంట్ చేశారు. అయితే కొంతమంది ఈ ఆప్టికల్ ఇల్యూషన్ షూ పై నెగిటివ్గా స్పందించారు. లెఫ్ట్ బ్రెయిన్ లేదు రైట్ బ్రెయిన్ లేదు ఆ షూ రక రకాల కలర్ లో మిక్స్ అయి ఉండడం వల్ల అలా కనిపిస్తుంది, అని విమర్శించారు. మరో వ్యక్తి దాన్ని కలర్ మార్చి కూడా చూపించాడు. సరే అవన్నీ వద్దులేండి మీకు ఏ కలర్ లో కనిపిస్తుంది ఆ షూ ఈ క్రింది వీడియో లో చూసి చెప్పండి.