రక్తపోటు అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత , నాడి లేదా హృదయ స్పందన జోరు

ఊపిరి జోరు, రక్తపు పోటు . ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని ‘అధిక రక్తపోటు’ అంటారు.

ఎవ్వరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది?’ అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. ప్రవర లింగం , వయస్సు, జాతి – అన్నీ కొద్దో గొప్పో దోహదం చేస్తాయి. తల్లి దండ్రులకి, దగ్గర బంధువులకి ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతూన్న కొద్దీ ఈసమస్యలు పెరిగే అవకాశం ఉంది.

గణాంకాల ప్రకారం అమెరికాలో ఉండే నల్ల వారిలో ఈపెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కారణాల వల్ల వచ్చే రక్తపు పోటు పెరుగుదలని ఇంగ్లీషులో అంటారు. వీటిని మనం అంతర్జనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు.

మన అలవాట్లని మార్చుకుని చాల వరకు రక్తపు పోటుని అదుపులో పెట్టవచ్చు. ఇటువంటి సలహాలని ఆచరణలో పెట్టే ముందు వైద్యుణ్ణి సంప్రదించటం అన్నిటి కంటే ముఖ్యం.1 .పొగ తాగటం మానటం.
2 .బరువుని అదుపులో పెట్టటం. ప్రతి వ్యక్తి విగ్రహానికి అనుకూలమైన బరువు ఉండాలి తప్పితే అతిగా ఉండకూడదు. లావుపాటి శరీరంతో పోలిస్తే బక్కపలచని శరీరం ఎప్పుడూ శ్రేయస్కరమే ఇంకా మంచి సమాచారం కోసం ఈ వీడియో చూడండి