ఈరోజే మార్గశిర మొదటి శుక్రవారం, మార్గశిర మాసము అంటే లక్ష్మీనారాయణ లకు, ప్రీతికరమైన మాసం అందులోనూ శుక్రవారము రోజు, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల సంపదలు చేకూరతాయి.

మార్గశిర మాసంలో వచ్చే గురువారంతో పాటు, శుక్రవారం రోజున లక్ష్మీ పూజను చేసే ఆచారాలు, పూర్వకాలం నుంచి ఉన్నాయి. మార్గశిర శుక్రవారం రోజు ధనలక్ష్మి దేవిని పూజిస్తే, ఇంట్లో సంపద ఐశ్వర్యం సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

మరి ఎంతో విశేషమైన ఈ మార్గశిర శుక్రవారం రోజు, ఈ కథను విన్నా చదివినా చెప్పిన వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఏ కద ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి ,ఏడుగురు కొడుకులు ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వల్ల, వేరే ఇంట కాపురాలు చేస్తూ ఉన్నారు.

ఒకరోజు ప్రొద్దుట శుక్రవారం మహాలక్ష్మీ లోకసంచారం చేస్తూ, ఆ బ్రాహ్మణుడి కోడలు ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి, తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు వాకిటిలో పేడ వేసుకుంటూ ఉంది. మరొక కోడలు పాత గుడ్డలను పిండుతున్నది. మరొక కోడలు పాచి వాకిటలో వడ్లు దంపుతూ ఉన్నది.

మరొక కోడలు పాచి, వాకిలి అంటే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది. ఈ విధంగా ఆరుగురు కోడళ్ళు చేయడం చూసి, శుక్రవారం మహాలక్ష్మి వాళ్ళ ఇళ్లకు వెళ్ళాక పెద్ద కోడలు ఇంటికే వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అల్లుకొని, వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి, పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్టకు ఇచ్చి, తాను తలుపు వెనక కూర్చుని ఉన్నది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..