ఏప్రిల్ 8వ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఏప్రిల్ 8న పాల్గొన అమావాస్య రాబోతుంది ఈ పాల్గొని అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది గనుక,

దీనిని సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. సోమవతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైన రోజని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే కాక ఈ రోజే రాహుగ్రస్తా సూర్యగ్రహణం కూడా ఏర్పడిపోతుంది. ఈ గ్రహణం 380 సంవత్సరాల తర్వాత వస్తుంది.

ఈ గ్రహణం మొత్తం ఐదున్నర గంటల సమయం ఉంటుంది. భారతదేశ కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం 8వ తేదీ రాత్రి 9:21 నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ఉదయం రెండు గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అంటే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు, కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు.

కనుక గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం కూడా లేదు. గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సూర్యగ్రహణం గురించి అస్సలు పట్టించుకోవద్దు వదిలి వేయండి. అమావాస్యగా పరిగణలోనికి తీసుకుంటే సరిపోతుంది. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సమక్షంలో వచ్చే చివరి అమావాస్య దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది.

ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేస్తూ పరమశివుని ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి, ఈరోజును కొత్త అమావాస్య అంటారు ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మసూచి అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవడం, జాతర ప్రధాన ఉద్దేశం..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి….