2023 శోభక్తు నామ సంవత్సరం అక్టోబర్ 28న రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడబోతూ ఉంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అరుదైన గ్రహణం ఈ సంవత్సరం మొత్తం రెండు సూర్యగ్రహణాలు రెండో చంద్ర గ్రహణాలు వస్తాయి.

ఇప్పటివరకు మొత్తం రెండు సూర్యగ్రహణాలు ఒక చంద్రగ్రహణం వచ్చాయి. అవేవీ కూడా మన ఇండియాలో కనిపించలేదు. 2023 అక్టోబర్ 28న వచ్చే చంద్రగ్రహణం ఈ సంవత్సరంలోనే ఆఖరి చంద్రగ్రహణం పైగా ఇది మన ఇండియాలో కనిపిస్తుంది.

సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు, సూర్యుని కాంతి చంద్రంపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు దీనిని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది.

అక్టోబర్ 28న ఏర్పడేది పాక్షిక చంద్ర గ్రహణం అంటే గ్రహణం అనేది పాక్షికంగా ఏర్పడుతుంది. ఇది రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశిలో సంచరించబోతుంది. కాబట్టి మేషరాశి వారెవ్వరూ కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు.

అంటే, అశ్వినీ నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారు ఈ చంద్రగ్రహరాన్ని చూడకూడదు. చంద్రగ్రహణం ఇండియాలో అక్టోబర్ 28వ తేదీ రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే 29వ తేదీన ఉదయం సమయంలో ఏర్పడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.