ఈ నెల 23 అనగా, డిసెంబర్ 23 2023న అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు.

ఈరోజు కనుక మీ ఇంట్లో రవి ఆకులతో ఇలా కనుక చేశారంటే ఆ లక్ష్మీనారాయణ ఆశీర్వాదం కలిగి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి.

దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే, మూడు కోట్ల ఏకాదశిలో మనం ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంతేకాదు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిలకు ఉపవాసం ఉన్నా ఫలితం కలుగుతుంది.

అందుకే మీరు ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పక ఉపవాసం ఉండాలి. ఈరోజు అన్నాన్ని స్వీకరించవద్దు. పండ్లు, పండ్ల రసాలు పాలు మాత్రమే తీసుకోవచ్చు. శ్రీమహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేత మంతుని వాహనంగా చేసుకొని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరికి వస్తాడు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు.

కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. లక్ష్మీనారాయణ భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది తెలియక ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది. చాలామంది తెలియక దీపారాధనను అలానే భూమిపై వెలిగిస్తారు. దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా, ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…