డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి రాబోతూ ఉంది. ఈరోజు శ్రీమహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తాడు.

ఏడాదికి 12 నెలలు నెలకు రెండు ఏకాదశలో దేని విశిష్టత దానిదే. 24 ఏకాదశిలలో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమాయణం ఆధారంగా చేసుకుంటూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశి మాత్రం శౌరమానం ప్రాతిపదికన చేసుకోవడం విశేషం. సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు.

ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం సాంప్రదాయం. ఈ పర్వదినం మార్గశిర మాసంలో గాని, పుష్య మాసంలో గాని వస్తుంది. ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్తుకు సృష్టి స్థితి లయ కారకుడైన శ్రీమన్నారాయణ డికి ప్రీతిపాత్రమైన సుధీనం కూడా ఇదే.

ఆషాడశుద్ధ ఏకాదశి నాడు జగద్రాక్షణ చింతన అనే యోగనిద్రకు పరిక్రమించిన శ్రీమహావిష్ణువు, మరల కార్తీక శుద్ధ ఉద్దాల ఏకాదశినాడు మేల్కొని, సర్వ దివ్యా మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రది ముక్కోటి దేవతలతో, తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువుని సేవించుకునే సమయం అవ్వడంతో, దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.