మనం పుణ్యం రావడానికి ఒకరికి సహాయం చేయడం కోసం, పరమాత్మలో ఐక్యం కావడం కోసం, దానం చేయడం చూస్తూ ఉంటాం, కానీ ఇవి తెలియకుండా ఎవరికైనా దానం చేస్తే ఆ దానం వల్ల మీకు పుణ్యం వస్తుందా లేదా పాపం వస్తుందా అర్థంకాక ధర్మ సందేహంలో పడతారు కాబట్టి, దానం చేసే వారు కచ్చితంగా వీటి గురించి అవగాహన ఉండాలి. మనం దానం చేయాలి అనుకున్నప్పుడు లేనివారికి దానం చేయాలి అనుకుంటే ఆ అభిప్రాయం మంచిదే, దీనికి కారణం ఇతరుల పట్ల ఉన్న కరుణ, లేని వారికి ఇస్తే వారికి ఉపయోగపడుతుందని అందరూ అభిప్రాయపడతారు, మనకన్నా ఉన్నవారికి ఇస్తే వారు స్వీకరించకపోగా మనల్ని అవమానించే అవకాశం కూడా ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా లేని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఉన్న వారు దానం స్వీకరించారు కాబట్టి లేని వారికి ఇస్తారు, అంతేకానీ ఉన్న వారికి దానం ఇవ్వకూడదని అర్థం కాదు.

అసలు లేనివారు అంటే ఎంత లేనివారు? ఏ స్థాయి వారు లేనివారు అంటే, ఎవరు అనే సందేహాలు వస్తాయి, అందువల్ల దానం ఎవరికీ ఇవ్వాలంటే, ఒక అన్నదానం మినహా మిగతా అన్నింటికీ కూడా ఏం చెప్పారంటే అర్హత అని చెప్పారు. అది ఉన్నవారు లేనివారు అని కాదు మంచి మనస్సు కలిగిన వారు, మనం ఏ వస్తువు దానం చేస్తాము దానిని సద్వినియోగం చేసుకునే వారు కావాలి. అది చాలా ముఖ్యం అంతేకానీ అతను ఉన్న వాడు లేనివాడు అని కాదు దానాన్ని సద్వినియోగం చేయడానికి కావలసిన సద్గుణ, సంపద ఉన్న వాడా లేని వాడ అనేది ముఖ్యం. ఆ సద్గుణ సంపద లేనివాడికి దానాన్ని ఇవ్వకూడదు. ఒక ఆవును దానం చేస్తే ఆ అవును శ్రద్ధగా చూసుకునే వారికే ఇవ్వాలి. ఆ ఆవుని మరుసటి రోజే కూడని పనికి వినియోగించే వారికి ఇస్తే దానం చేసిన వారికి కూడా దోషం తగులుతుంది. దానం ఇచ్చిన వారు కూడా తప్పు చేసినట్లే.

ఒక తాగుబోతుకి, ఒక వ్యసనం ఉన్నవాడికి ఒక వంద రూపాయలు దానం చేస్తే వాడు తాగి భార్యాబిడ్డల్ని కొడతాడు, వాడు చేసిన తప్పు కి మనం దోహదం చేసినట్లు అవుతుంది. ఒక అన్నం పెట్టడానికి మాత్రం ఆకలి మాత్రమే అర్హత మిగతా అన్నింటికి కూడా తగిన అర్హత చూసి దానం చేయాలి. అంతేకానీ ఉన్నవాడా, లేనివాడా అనే శాస్త్రాలు చెప్పలేదు. అయితే శాస్త్రాలలో దానం ఎలా చేయాలో చెప్పారు. దానం ఎందుకు చేయాలంటే వాళ్లకు లేదు కాబట్టి మనం ఇవ్వడం కాదు, దానం అంటే ఇది నాది కాదు అని అర్థం. ఇది నాది కాదు అంటే దానిపై మమకారం ఉండకూడదు కాబట్టి, మమకారం లేకుండా దానం చేయాలి. అలానే నేను చేస్తున్న అనే అభిప్రాయంతో దానం చేయకూడదు, అంటే అహంకారం లేకుండా దానం చేయాలి.
మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.