సంవత్సరంలో నాలుగు సార్లు ముఖ్యమైన నవరాత్రులు వస్తాయి. అవి కాని శ్రద్ధగా చేయగలిగితే గనుక, అమ్మవారి గొడుగు కిందకి వెళ్తారు అని తెలుసు.

దానివల్ల మీరు వారాహి నవరాత్రి, శ్యామల నవరాత్రి అలాంటివి చేశారు. ఇప్పుడు మరో ముఖ్యమైన నవరాత్రులు రాబోతున్నాయి, అవే వసంత నవరాత్రులు అందుకని వసంత నవరాత్రులు తేలిగ్గా చేసుకునే మార్గాన్ని తెలుసుకుందాం. అసలు ఎందుకు చేయాలి అంటే సంవత్సరంలో వచ్చే నాలుగు నవరాత్రులలో చాలా ముఖ్యమైనవి వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ఎందుకు అంటే యమద్రంశ్టలు అంటారు.

అంటే మృత్యువు యొక్క కోరలు అన్నమాట అవి సంవత్సరంలో రెండు సమయాల్లో బయటికి వస్తాయి. ఆ సమయమే చైత్రమాసం మొదట్లోనూ, అశ్వయుజ మాసం మొదట్లోనూ, సృష్టిలో మృత్యువు అనే శక్తి ఒకటి ఉంది చూడండి. ఆ శక్తి విపరీతమైన ఆక్టివేట్ అయిపోతుంది, అలాంటప్పుడు మనని మన కుటుంబాన్ని మన చుట్టూ ఉన్న పరిసరాలని కాపాడుకోవాలి అంటే,

ఈ నవరాత్రులు చేస్తే కనుక కాపాడబడతారు అనేది మహర్షులు తెలియజేశారు. అందుకని ఈ నవరాత్రులు చేయడం మన కుటుంబం కోసం మనకోసం చేసుకోవాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా, ఒక్కసారి నవరాత్రులు శ్రద్ధగా చేసి చూడండి 9 రోజులు, అమ్మదయ ఎలా ఉంటుంది అనేది మీరే అనుభూతి చెందుతారు. అంత గొప్ప పర్వదినం,

ఎప్పుడో చేయాలి అంటే ఉగాది రోజు నుండి మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు చేయాలి. వీటిని లలిత నవరాత్రులు అంటారు, లేకపోతే గర్భ నవరాత్రులు అంటారు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి భూమి మీదకు దిగి వచ్చిన అద్భుతమైన అవతారం, ఆ మహానుభావుడు వాళ్ళ అమ్మగారి గర్భంలో ఉన్న ఆఖరి 9 రోజులు అందుకే గర్భ నవరాత్రులు అని పిలుస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.