నేటి సమాజంలో ప్రేమానురాగాలు అనేవి ఆస్తి పంపకాలపైనే ఆధారపడి ఉంటున్నాయి. ఇక ఈ ఆస్తి పంపకాల వలన ఒకే కుటుంబానికి చెందిన వారు సైతం గొడవలు పడి విడిపోతున్నారు. అంతేకాదు ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులను బయటకు గెంటేసిన కొడుకులు కూడా ఉన్నారు.

అయితే ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటికే చాలా చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు చోటు చేసుకుంది అనేది తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని గమనించినట్లయితే సోఫా పైన కూర్చుని ఉన్న ఓ వ్యక్తిని ఓ యువకుడు వచ్చి పిడుగుద్దులతో మొఖంపై కొట్టడం మొదలు పెట్టాడు.

ఇక ఆ వ్యక్తి వయసు కూడా చాలా పెద్దది కావడంతో తట్టుకోలేక అపస్మారక స్థితికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే. కే సంతోష్ (40)అనే వ్యక్తి ఆస్తికోసం తన కన్న తండ్రి పై వికృత స్థాయిలో దాడి చేశాడు. ఈ వీడియోలో సోఫాలో కూర్చుని కనిపిస్తున్న వ్యక్తి శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని కులందైవేలు (63)అని తెలుస్తోంది. అయితే అతని కొడుకు సంతోష్ ఆస్తి కోసం తన తండ్రి పై వికృత స్థాయిలో దాడి చేయడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయాడు. దీంతో గత రెండు నెలలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఏప్రిల్ 18న గుండెపోటుతో మరణించారు.

అయితే కులంధైవేలు మరణం పై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కొడుకు సంతోష్ తండ్రిని దారుణంగా కోడుతున్న వీడియో బయటపడింది. దీంతో పోలీసులు సంతోష్ ని ఏప్రిల్ 25 న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆస్తి కోసం తండ్రిని ఇంత దారుణంగా కొట్టిన సంతోష్ ను నేటిజనులు తిట్టిపోస్తున్నారు.