వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత పీకల్లోతో ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి బ్రతకాలి అనుకున్నారు. కులాలు వేరైనప్పటికీ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.

మూడేళ్ల కాపురం అనంతరం తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసి ఎంతో మురిసిపోయారు. ఆ భార్య భర్తలు కానీ వారి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. శుభవార్త తెలుసుకున్న కొద్దిసేపటికే భార్యాభర్తలిద్దరూ గదిలో విగత జీవులుగా మారిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అశ్వరావుపేటకు చెందిన ఎర్రం కృష్ణ మూడేళ్ల క్రితం ధర్మపీఠం మండలం నెమలి పేటకు చెందిన రమ్యను ప్రేమించే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన దగ్గర నుండి భార్యాభర్తలు ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇదే విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ 15 రోజుల క్రితం వేరు కాపురం పెట్టారు.

భార్య రమ్యకు ఆరోగ్యం బాగాలేదని కృష్ణ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె మూడు నెలల గర్భవతి అని తేలింది. తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసి భార్యాభర్తలిద్దరూ ఎంతో మురిసిపోయారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ ఇద్దరికీ గొడవ మొదలయ్యింది విసిగిపోయిన భర్త, తమ కూతురిని ఇంటికి తీసుకు వెళ్ళండి అంటూ రమ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు.

అయితే అదే రోజు కృష్ణ తల్లి నాగమ్మ ఫోన్ చేసిన సమాధానం రాకపోవడంతో ఇంటికి వచ్చే చూసింది. గదిలో కృష్ణ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు. బెడ్ పై రమ్య అనుమానాస్పద స్థితిలో బెడ్ పై మృతి చెంది కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కృష్ణ రమ్య మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.