ఈసారి 2024వ సంవత్సరం సోమవారము పంచమి తిథితో, ప్రారంభం అవుతుంది. అనగా జనవరి ఫస్ట్ సోమవారం వచ్చింది. ఈ సంవత్సరం పంచమి తిథితో ప్రారంభం అవటం చాలా విశేషం.

పంచమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిధి, న్యూ ఇయర్ పంచమి తిధితో ప్రారంభం అవటం చాలా మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు. నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు, కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగను మన సంస్కృతిలో కలుపుకొ,ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాo.

దానిలో ఎటువంటి తప్పులేదు ఎందుకంటే, నూతన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా, మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. 2023 కి బాయ్ చెప్పి 2024 కి స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు.

ఈసారి జనవరి ఫస్ట్ సోమవారం పంచమి స్థితితో కలిసి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని, జ్యోతిష్యులు చెబుతున్నారు. అంటే అప్పులు కావచ్చు ఖర్చులు కావచ్చు, డబ్బు పరంగా బాగా సమస్యలు వస్తాయి. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పటంలో, అతిశయోక్తి లేదు.

ఈరోజుల్లో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేదు, ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కొన్నిసార్లు డబ్బు వలన సొంతవాళ్లు కూడా పరాయి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు. మరి డబ్బుకు సంబంధించిన సమస్యలేమి, 2024వ సంవత్సరంలో రాకుండా ఉండాలంటే, లక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఆడవారు ఈ రోజున రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ లో కానీ, లేదా పసుపు రంగులో కానీ, ఉండే చీరను ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది దీర్ఘ శుభ మంగళ యోగం కలుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.