ఇంటికి దీపం ఇల్లాలన్నీ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని, ఎలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ,ఆడపిల్ల కడుపులో పడింది అని తెలిసి తెలియగానే, కడుపులోనే చిదిమేసే వాళ్ళు మన సమాజంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు.

ఆడపిల్ల పుడితే మైనస్ అని, మగపిల్లాడు పుడితే ప్లస్ అని, భావించే మూర్ఖులకు కూడా కొదవలేదు. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం, భారంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారు.

అని తెలిస్తే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎవరైతే పూర్వజన్మలో దానధర్మాలు చేశారు, ఎవరైతే పుణ్యాత్ములు వారి కడుపులో మాత్రమే ఆడపిల్లలు పుడతారు. ఈరోజు మనం ఈ వీడియోలో భగవంతుడు ఆడపిల్లల్ని ఏ ఇంటిలోకి పంపిస్తాడు, ఆయన ఆడపిల్లల తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటాడో తెలుసుకుందాం.

ఎలాంటి పుణ్య కర్మలు చేస్తే ఆడపిల్ల పుడుతుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగాడు, అంటే ఎలాంటి ఇంటిలో ఆడబిడ్డ అడుగులు వేస్తుంది ఆడపిల్లను కనాలి అంటే, తల్లిదండ్రులు ఏం చేయాలి అని అడిగారట, అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో, పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారు, అలాంటివారు మాత్రమే ఆడపిల్లలకు జన్మనిస్తారని చెప్పారు.

ఆడపిల్లల భారాన్నే సహించగలిగేవా లలో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు, ఆడపిల్లల్ని ఎవరు పడితే వాళ్ళు పెంచలేరు, గుండెల మీద కొంపటి అనే చాలా మంది భావిస్తూ ఉంటారు. ఆడపిల్లలు పెంచే స్తోమత వాళ్లకు లేదు అని వాళ్ళు గ్రహించరు. ఎలాగైతే బంగారాన్ని వజ్రవైఢూర్యాలని ప్రతి ఒక్కరూ కొనలేరో, అదే విధంగా ఎవరు పడితే వాళ్ళు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు, కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది. సృష్టికి మూలం ఆడది అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఆడది అమ్మగా మారడానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది కానీ, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో, అప్పటినుండి ఈ విశ్వంలో మానవజాతి కూడా అంతరించిపోతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..