అక్టోబర్ 28 పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగు రాశులను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 వ సంవత్సరం, అక్టోబర్ 28వ తేదీ శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ఐదు నిమిషాలకి రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం,

అశ్వినీ నక్షత్రం మేష రాశిలో ఏర్పడుతుంది. అంటే ఈ రాహు గ్రస్తపాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయం స్పర్శాకాలం అక్టోబర్ 28 శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ఐదు నిమిషాలు, ఈ రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అర్ధరాత్రి రెండు గంటల 23 నిమిషాలకు పూర్తవుతుంది.

అంటే మోక్షకాలం రెండు గంటల 23 నిమిషాలు అర్థరాత్రి ఈ రాహుగ్రస్తా పాక్షిక చంద్రగ్రహణం అనేది మేషరాశిలో అశ్వినీ నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలవాళ్లు. భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలవాళ్ళు.

కృతిక నక్షత్రం నక్షత్రం ఒకటవ పాదం వాళ్ళు, మేషరాశి వాళ్లు ఈ గ్రహణాన్ని చూడరాదు. అయితే ఈ రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేది 12 రాశులలో నాలుగు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎప్పుడైనా సరే గ్రహణ గోచారం అని ఒకటి ఉంటుంది.

ఆ గ్రహణ గోచారం అనేది గ్రహణం వల్ల మనకు కలిగేటటువంటి రాజయోగాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుండి లెక్కపెట్టినప్పుడు, వచ్చే మూడవ రాశిలో గానీ ఆరవరాశిలో గాని, పదవ రాశిలో గాని 11వ రాశిలో గానీ గ్రహణం వచ్చినట్లయితే ఆ గ్రహణం అనేది మనకు అఖండ రాజయోగాన్ని కలిగింప చేస్తుందని జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.