2023 అక్టోబర్ 14న శనివారం రోజు మహాలయ అమావాస్య రాబోతూ ఉంది. ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఇలా 76 సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఇప్పుడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

శనివారం రోజు అమావాస్య తిధి కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు. అమావాస్య శనివారం రావడం చాలా విశేషం. దీనిని శని అమావాస్య అని పిలుస్తారు. ఇది శని దేవుడికి ఇష్టమైన రోజు, నవగ్రహాలలో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మానాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శని దేవుని అశుభ దృష్టి ఉన్నవారు, భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

శనివారం అమావాస్య తిధినాడు శని దేవుడు జన్మించాడని నమ్ముతూ ఉంటారు. అందువల్ల శనివారం నాడు యాదృచ్ఛికంగా అమావాస్య తిధి వచ్చినట్లయితే, ఆరోజు శని దేవుడిని ఆరాధించడం మంచిదని శాస్త్రాలలో పేర్కొన్నారు. శనికి సంబంధించిన అనేక బాధలను సమస్యలను ఈ సమయంలో దూరం చేసేందుకు, పరిహారాలు చేస్తారు.

శని అమావాస్య కేవలం ఏడాదికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. కొన్నిసార్లు అయితే శని అమావాస్య యోగం ఏడాదికి ఒక్కసారి కూడా రాకపోవచ్చు. ఈ రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు దానధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే, అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.