క్యాబేజీ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉండి నీరు అధికశాతం ఉండే కూరగాయ. సలాడ్, ఫ్రైలలో ఎక్కువగా ఉపయోగించే క్యాబేజీ ఆరోగ్యకరంతో పాటు ప్రాణాలకు ప్రమాదం కూడా కాగలదు. అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలను తీసుకోవడం వలన చాలా ప్రతికూల ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యాబేజీ వంటి మొక్కల ఆధారిత ఆహార పదార్థాల వినియోగం పెరగడం వలన మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు మరియు మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు సూచించాయి. ఇది ఆరోగ్యకరమైన రంగు, పెరిగిన శక్తి మరియు మొత్తం ఎక్కువ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

అసలు క్యాబేజీ ప్రాణాపాయం ఎలా అవుతుందో తెలుసుకుందాం. ఢిల్లీలో ఉండే ఎనిమిదేళ్ళ ఒకపాప తీవ్రమైన తలనోప్పితో బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకు స్కాన్ చేసిన కూడా కారణం తెలియలేదు. దాంతో ఆపరేషన్ చేసిన డాక్టర్లకు విస్తుపోయే నిజం తెలిసింది. ఆమె మెదడులో టేప్వార్మ్ అనే పురుగుతో పాటు దానికి సంబంధించిన ఎనిమిది వందల గుడ్లు కనిపించాయి. వాటిని బయటకు తీసేసిన డాక్టర్లు ఆమెను కాపాడారు. ఆలస్యం అయ్యుంటే ఆ గుడ్లు పిల్లలుగా మారి ఆమె ప్రాణాలకే ప్రమాదమయ్యేదని చెప్పారు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.

ఆ పాప తల్లిదండ్రులతో మాట్లాడిన డాక్టర్ లకు ఒక విషయం తెలిసింది. వారి చుట్టుపక్కల క్యాబేజీ పంట ఉండడం వలన ఆ మధ్యకాలంలో ఎక్కువగా క్యాబేజీని ఆహారంలో తీసుకున్నారని. క్యాబేజీలో ఉండే ఈ టేప్ వార్మ్ పురుగులు క్యాబేజీ జాతికి చెందిన క్యాలిఫ్లవర్లో కూడా అధికంగా ఉంటాయి. కంటికి కనిపించనంత చిన్నగా ఉండి క్యాబేజీలో, క్యాలీఫ్లవర్ సరిగ్గా శుభ్రం చేయకపోయినా లేదా ఎక్కువగా ఉడికించక పోయినా ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయి. మొదట మన పొట్టనుండి రక్తంలోకి చేరి తర్వాత మన శరీరంలోని ముఖ్య భాగాలైన గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడులో చేరి పెద్దవయి గుడ్లు పెడతాయి.ఈ గుడ్లు పెట్టినపుడు మన శరీర భాగాలు విపరీతమైన నొప్పితో బాధపడుతాయి. ఒకవేళ ఆ గుడ్లు పిల్లలుగా మారితే మన శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాలకు ప్రమాదం రావచ్చు.

ఈ పురుగులు మనం తినే ఆహారాన్నే తమ ఆహారంగా మార్చుకుంటాయి. వీటి వలన ఆకలి తగ్గిపోవడం, పోషకాలను శరీరం గ్రహించలేకపోవడం వలన మూర్ఛ వ్యాధి వస్తుంది. అందుకే అప్పుడప్పుడు డీవార్మ్ టాబ్లెట్స్ వేసుకోవడంవలన మనం తినే ఆహారం వలన చేరిన వార్మ్స్, బ్యాక్టీరియా లాంటివేమైనా ఉంటే చనిపోతాయి. క్యాబేజీ తినకూడదా అంటే కాదు క్యాబేజీ ఆరోగ్యానికి మేలుచేసే అనేక గుణాలు ఉన్నాయి. క్యాబేజీ అనికాదు ఆకుకూరలు, కూరగాయలపై కూడా బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఉంటాయి. అప్పుడు కూరగాయలు, ఆకుకూరలను నీటిలో ఉప్పు, వెనిగర్ వేసి కనీసం ఇరవై నిమిషాలు శుభ్రంగా కడిగి మంచినీటితో మరోసారి కడిగి బాగా ఉడికించి తినాలి. పచ్చిగా లేదా సగం ఉడికించిన కూరగాయలను తినకూడదు.