ప్రస్తుత జనరేషన్ లో 30 సంవత్సరాల వయసు దాటిన అమ్మాయిలు కూడా చాలా అందంగా ఫ్రెష్ లుక్ తో కనిపించడం సర్వసాధారణం అయింది. ఇందుకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల కాస్మోటిక్స్ తో పాటు నేటి తరం అమ్మాయిల ఆలోచనలు వారి రొమాంటిక్ లైఫ్ లాంటి ఎన్నో విషయాలు వారు 30 లోనూ అందంగా కనిపించేలా చేస్తున్నాయి. వారు అలా కనిపించడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వయసును చూసే కోణం మారింది, దశాబ్దం కిందటి వరకూ అమ్మాయిల్లో 20 నుంచి పాతికేళ్ళ వయసు మధ్యలోనే తమ అందం ఉంటుందని, 30 దాటే సమయానికి తమలో వృద్ధాప్య చాయలు ప్రారంభమవుతాయని, అందం తగ్గుతూ పోతుందని భయపడే వారు. మారుతున్న ఆలోచనలు అందుకు తగినట్టుగా డెవలప్ అయినా బ్యూటీ, కాస్మటిక్ ఇండస్ట్రీ మెడికల్ టెక్నాలజీ ఇప్పుడు ముప్పై దాటినా కూడా యంగ్ గా, ఫ్రెష్ గా కనిపించేలా చేస్తున్నాయి. అమ్మాయిలలో ఈ ఒకప్పటి భయం ఆత్మవిశ్వాస లోపం ఇప్పుడు లేదు. ఇది వారిని మరింత ఆకర్షణీయంగా అందంగా కనబడేలా చేస్తోంది.

అడ్వాన్స్ కాస్మెటాలజీ వినియోగం: ఈ కాలం అమ్మాయిలు కాస్మెటిక్ ఇండస్ట్రీలో వచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా వాడటానికి సంకోచించడం లేదు. కలర్ తక్కువైనా ముఖంపై ఎలాంటి లోపాలు ఉన్నా ఇలా ప్రతి సమస్యకి ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీ దగ్గర సమాధానం ఉంది. అంతలా కాస్మోటిక్ ఇండస్ట్రీ డెవలప్ అయింది అందంగా కనిపించడం కోసం ఉన్నా ఏ అవకాశాన్ని ఇప్పుడున్న అమ్మాయిలు వదులుకోవడం లేదు. ఆర్థిక స్వాతంత్ర్యం, స్వతంత్ర భావాలున్న ఇవ్వాల్టి మహిళలు 30 ఏళ్ల తర్వాత కూడా ఫ్రెష్ గా, యుంగ్ గా కనిపిస్తున్నారు.