కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిధికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు 365 వొత్తుల దీపాన్ని వెలిగిస్తారు. నదీ స్నానాలు చేస్తారు, అలానే ఈరోజు కార్తీకదీపం నీటిలో వదులుతారు, అంటే అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి,

నీటిలో వదులుతారు, అంతేకాదు కార్తీక పౌర్ణమి కడియాలలో ఎన్నో నోములు పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేస్తారో, 365 వొత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఆ ఇంట్లో సాక్షాత్తు శివపార్వతుల మరియు లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు.

ఆ ఇల్లు నిత్యం సిరి సంపదలతోగుతూ ఉంటుంది. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమిని 2023లో ఎప్పుడు జరుపుకోవాలి. నవంబర్ 26న లేక 27న ఈ రోజు కార్తీక పౌర్ణమినే జరుపుకుంటే పూర్తి ఫలితం లభిస్తుంది, అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ప్రతీ పండుగ కూడా తగులు మిగులుగా వస్తున్నాయి, అంటే తిధులు మధ్యాహ్నం స్టార్ట్ అవ్వడం వలన, అందరూ పండుగల విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి కూడా అన్ని క్యాలెండర్స్ లో నవంబర్ 27 సోమవారం అని ఉంది. కానీ మనం తిధి నక్షత్రాలను బట్టి కార్తీక పౌర్ణమి చేసుకుంటాం. కార్తీక పౌర్ణమి కి రాత్రి సమయంలో పౌర్ణమి ఘడియలు ఉండాలి. ఎందుకంటే ఆ రోజు రాత్రి పున్నమి వెన్నెలలో అమృతం ఉంటుంది.

అలా ఉన్న సమయంలో మనం ఏం చేసినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా రాత్రి సమయంలో పౌర్ణమి గడియాలు ఉన్న రోజే, ఈ ప్రకృతిలో కూడా కొన్ని శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఆశక్తులను మనం పొందాలంటే, ఆరోజు పౌర్ణమి గడియంలో శివారాధన తప్పక చేయాలి. పున్నమి చంద్రుడు ఉన్న సమయంలో వెన్నెలలో గడపాలి. మన శరీరానికి వెన్నెల తగిలేలాగా చూసుకోవాలి. అలా చేస్తే అందులోని అమృత తత్వం, మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..