కలియుగ దైవం ఆ శ్రీనివాసుడే లీలలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ శ్రీనివాసుడి నిలయమైన తిరుపతి గురించి ఆలయ సంపద గురించి, ప్రపంచ దేశాలే చెప్పుకునే అంత స్థాయికి వెళ్లిందంటే, ఆ శ్రీనివాసుడి మహిమ ఎంతటిదో మనం గ్రహించవచ్చు.

అలాంటి శ్రీనివాసుడు చేసిన ఒక అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది పశ్చిమగోదావరి జిల్లాలోనే ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలోని శ్రీనివాసుడికి ఒక పెద్ద ఆలయం ఉంది. ప్రతిరోజు అందులో పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక శనివారం వచ్చిందంటే మాత్రం మా ఊరంతా కోలాహలంగా మారిపోతుంది.

ప్రతి శనివారం ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ అనుసంధారాధనతో నిండిపోతుంది. అయితే కొన్నేళ్ల క్రితం సరిగ్గా తొలి ఏకాదశి నాడు ఆ శ్రీనివాసునికి అభిషేకం చేస్తున్న సమయంలో, ఒక అద్భుతం జరిగింది. తొలి ఏకాదశి అంటే తెలిసిందే కదా మనం జరుపుకునే మొదటి పండుగ.

దానికోసం ఎంతోమంది భక్తులు ఆ సంవత్సరం అంతా అన్నీ పండుగలతో ఊరంతా సుఖంగా ఉండాలని కోరుకోవడానికి ఆలయానికి వచ్చారు. అందరూ పూజలు చేసి అభిషేకం చేస్తున్న సమయంలో సరిగ్గా ఆ తిరుమల నాదుని చేయి కదలడం మొదలైంది. ఎవరు మొదట దీనిని గమనించలేదు కానీ, ఒక పూజారి దీనిని గమనించడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఒక చేయి ఆశీర్వదించినట్లుగా ఉంటుంది కదా, అదే చేయి మరికొంత పైకి లేచి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది.

వెంటనే అతడు అక్కడి వారికి చెప్పగా, అందరూ ఆ అద్భుతాన్ని చూసి నివ్వెర పోయారు. ఆ ఒక్క క్షణంలో జరిగిన ఆ సంఘటన పది నిమిషాల్లో ఊరంతా పాగిపోయింది. ఇక ఊరి భక్తులంతా అక్కడికి చేరుకొని ఆ అద్భుతాన్ని తిలకించారు. దానితో ఇక ఆ సంవత్సరం అంతా ఎంతో సుఖశాంతులతో పండుగలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నామని, నమ్మకంతో ఆశ్రినివాసునీ దర్శించుకొని ఇంటికి బయలుదేరారు. ఇప్పటికీ ఆ ఊరి వాళ్ళు ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని తమ పిల్లలకు చెబుతూ ఉంటారు, ఆ శ్రీనివాసుడి లీలలు చూశారా.