ఉజ్జయిని అత్యాచారం ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. నడి వీధిలో అర్ధా నగ్నంగా రక్తపు మడుగులో ఒక బాలిక సాయం కోరిన వీడియో అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. సాయం కోసం బతిమిలాడితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోని దీనస్థితిలో ప్రజలు బ్రతుకుతున్నారంటూ, నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అత్యాచార ఘటనలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆన్యం పుణ్యం తెలియని 12 ఏళ్ల బాలిక నీచుల చేతిలో అఘాయిత్యానికి గురై రోడ్డుపై చెప్పులు లేకుండా, ఎనిమిది కిలోమీటర్లు సాయం చేయమని అడిగిన ఎవరూ స్పందించలేదు. పైగా కొందరు పొమ్మంటూ సైగలు కూడా చేయడం వీడియోలో కనిపించింది.

చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. అక్కడ రాహుల్ శర్మ అనే పూజారి ఆ బాలికకు దుస్తులు ఇచ్చి, ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగింది అంటూ నిర్ధారించారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసే విచారణ చేపట్టింది. ప్రస్తుతం మా బాలికను ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని, మధ్యప్రదేశ్ హోం మంత్రి చెప్పారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఒక ఆటో డ్రైవర్ తో పాటు, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. బాధిత బాలిక జీవన్ ఖైదీ వద్ద ఆటో ఎక్కిందని తనకు సంబంధించిన సీసీటీవీ వీడియో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆటో పై రక్తపు మరకలు ఉండడంతో వాటిని నమోనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని పోలీసులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ఉజ్జయనికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్లో ఆమె తాత అన్నయ్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసింది. ఆదివారం బయటికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉండగా ఉజ్జయిని మహంకాళి ఇన్స్పెక్టర్ అజయ్ వర్మ పెద్ద మనసు చాటుకున్నాడు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాడు. ఆ బాలిక తల్లిదండ్రులు ముందుకు రాకపోతే తానే ఆ పాపను దత్తత తీసుకుంటానని, ఒక పోలీస్ అధికారి ముందుకు వచ్చాడు. అంతేకాకుండా ఆమె కోలుకునేంత వరకి చికిత్స కాయ ఖర్చుతో పాటు ఆమె చదువుకయ్యే ఖర్చు తానే భరిస్తానంటూ పోలీస్ అధికారి తెలిపారు.