ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల మొక్కలోని ఔషధ గుణాలను, మనకు తెలియక వాటిని వాడకుండా, మనం పడేస్తూ ఉంటాం కానీ, ప్రకృతి మన కోసం ఎన్నో రకాల ఔషధాలను మన కోసం దాచి పెట్టి ఉంచింది. వాటిని మనం తెలుసుకుని ప్రతి మొక్కలోని ఔషధ గుణాలను ఉపయోగించుకోగలిగితే, మనం ఆరోగ్యవంతులుగా ఉండడం అతికష్టం ఏమీ కాదు, ఇంగ్లీష్ మందుల జోలికి పోకుండానే ప్రకృతి వైద్యం తో మనం ఎన్నో రకాల జబ్బులను, రోగాలను, నయం చేసుకోవచ్చు, అలాంటి మొక్కలలో ఒకటి వావింట మొక్క మీరు చూస్తున్న ఈ మొక్కను వావింట మొక్క లేదా వావింట అని తెలుగులో పిలుస్తారు.

ఈ మొక్కలు వర్షాకాలంలో ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మొక్కలను పనికిరాని మొక్కలుగా భావిస్తారు, ఎందుకంటే ప్రకృతిలో దొరికే చాలా రకాల మొక్కల యొక్క ఔషధ గుణాల గురించి మనకు తెలియదు కాబట్టి. చాలా వరకు మనం పిచ్చి మొక్కలు గానే భావిస్తాం, అలా భావించే వాటిలో ఈ వావింట కూడా ఒకటి, ఈ మొక్కలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్కలో ఉన్న అవషధ గుణాలు తెలిస్తే ఎవరైనా, సరే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఈ మొక్కలు విరివిగా పెరిగే ఏ ప్రాంతంలో అయినా వీటిని తీసుకొని,, మనం ఔషధ యుక్తంగా వాడుకోవచ్చు, ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో చెరుగడు చెప్పిన దాని ప్రకారం ఈ మొక్కలోని ప్రతి భాగం అనేక రకాల వ్యాధులకు వాడినట్లుగా తెలుస్తోంది..

అదేవిధంగా ప్రాచీన ఆయుర్వేద వైద్యులు వీటిని ఉపయోగించినట్లు గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. వర్షాకాలంలో వీటి ఆకులను పూర్వం రోజులలో కూరగా వoడుకొని మన పెద్దలు తినేవారు. ఎందుకంటే ఆ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని, రోగనిరోధక శక్తిని ఈ మొక్కలోని ఆకులను పెంచుతాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ ఆకులను కూరగా వండుకొని తినడం. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు చేసేవారు. ఇది తినడం వల్ల చాలా మంచిది ఎన్నో వ్యాధులు మన దరి చేరకుండా కాపాడుతుంది. వీటి ఆకులను శుభ్రంగా కడిగి వాడుకోవచ్చు, మరియు వీటి ఆకులను వండుకుని తినవచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొంతమంది ఈ ఆకులను కూరగా చేసుకుని తినడం చూస్తూ ఉంటాం..

ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, సోడియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, తో పాటు విటమిన్ లు, యాంటీ ఆక్సిడెంట్, మరియు యాంటీ ఇంక్రిమెంట్, ధర్మాలను కలిగి ఉంటాయి. వీటి ఆకులు మంచి ఆహారం అదేవిధంగా, పాలిచ్చే తల్లులకు ఈ ఆకులు తినిపించడం వల్ల పాలు పడతాయి. కొన్ని ప్రదేశాలలో గర్భిణీగా ఉన్నప్పుడు వావింట మొక్క ఆకులను వారికి తినిపిస్తూ ఉంటారు. వీటీ విత్తనాల నుంచి తీసిన ఆయిల్ను వంటలలో వాడుకోవచ్చు, ప్రాచీనకాలం నుండి భారతీయ సంప్రదాయ వైద్యం, తమిళ సిద్ధ వైద్యంలో, ఆయుర్వేదంలో, విరివిగా వాడుతున్నారు. సైనస్ మరియు తలనొప్పితో బాధపడేవారు, వీటి ఆకులను సేకరించి, నీటిలో బాగా మరిగించి ఆవిరిని పీలిస్తే దాని నుండి వచ్చే ఆవిరిని పిలుస్తూ ఉంటే కనుక, సైనస్ నుండి వచ్చే తలనొప్పి సమస్య పోతుంది.

ఆడవారిలో సంతానం కలగడంలో ఏమైనా లోపాలు ఉంటే, ఈ మొక్క ఆకులు పనిచేస్తాయి. వాటిని శుభ్రంగా కడిగి మూడు లేదా నాలుగు ఆకులను తినాలి. ఇలా తిన్న తర్వాత గంట వరకు ఏమి తినకూడదు, ఇలా వారం రోజులు చేస్తే గర్భం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి….