ఇక్కడ 60 లోను పిల్లల్ని కంటారంట, 120 ఏళ్ల పైన బ్రతుకుతారంట, మనం 50 దాటగానే ఆనొప్పి నొప్పి అంటూ మాత్రలు వేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్లు మాత్రం అక్కడ ఒక మాత్ర కూడా

మింగకుండానే 120 ఏళ్ళు పైన బతుకుతారంట. వయసు మీద పడే కొద్ది మన శరీరం మనకే బరువు అవుతుంది కానీ, అక్కడ 90 ఏళ్లకు రక్తం ఉరకలు వెస్తుందట. 30 దాటగానే ముఖంపై ముడతలు, అదే అక్కడ 80 దాటిన వారికి అందం చెక్కుచెదరదట, ఎవరు అబ్బా వాళ్ళు అనుకుంటున్నారా.

పర్వతాలపై నివసించే హుంజ తెగకు చెందిన మనుషుల గురించి మనం మాట్లాడుకుంటుంది. వయసు పెరుగుతున్న తరగని అందానికి, వృద్ధాప్యం భయపడుతున్న తరగని ఉత్సాహానికి చిరునామాగా నిలుస్తున్నారు. ఈ తెగవకు చెందిన మహిళలు అందుకే ప్రపంచంలోనే అందగత్తెలు ఎక్కువ కాలం జీవించే వారిగా పేరుగాంచారు. ఇదంతా వింటుంటే అసలు వీరి ఆరోగ్యం అందం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది కాదు.

మనం రోజు ఇంతలా కష్టపడేది సమయంతో పని లేకుండా, కెరియర్ వెంట పరుగులు తీసేది ఎందుకు, కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటి కోసమే కదా, అయితే డబ్బు మోజులో పడిపోయి చాలామంది తమ ఆహార పల్లవాట్లను మార్చేసుకుంటారు. డబ్బు ఖర్చుపెట్టే హోటల్ లో రెస్టారెంట్లలో తింటే గాని జీవితాన్ని ఆస్వాదించినట్లు ఉండదని భ్రమలో ఉంటారు. నిజానికి ఇలాంటి జీవనశైలి మనిషి సగటు ఆయుష్షుని తీస్తుందని చెప్పవచ్చు. అదే ఆరోగ్యకరమైన జీవనశైలిని మనం రోజువారి అలవాట్లలో భాగం చేసుకుంటే నిండు నూరేళ్లు జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించవచ్చు.

ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు ఈ హంజా తెగకు చెందినవారు. ఈ తెగవారు వండినవి తినడానికి అసలు ఇష్టపడరు. ఎక్కువగా పండ్లు పచ్చి కూరగాయలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అది కూడా స్వయంగా సహజ సిద్ధంగా పండించుకొని మరి తింటూ ఉంటారు. ముఖ్యంగా పాలు పెరుగు బార్లీ తృణధాన్యాలు, గోధుమలు మొలకెత్తిన గింజలు ఇక్కడ ప్రజలు ప్రధాన ఆహారంగా చెప్పుకోవచ్చు. అలాగే హిమాలయాలనుంచే ప్రవహించే నీటిని తాగడం వల్ల వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. వీరు రోజుకి రెండు పూట్ల మాత్రమే భోజనం చేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…