వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని ఒక మోడల్ స్కూల్ హాస్టల్ లో చోటు చేసుకున్న వింత వింటే ఎవరైనా నోటిమీద వేసుకోవాలి. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగిన సిటీ అమ్మాయిలు, సిటీ అమ్మాయిలు అంటూ సిటీలో ఉన్న అమ్మాయిలను ఏదో ఒక మాట అనడం, వారు అన్ని విషయాలలో ఫాస్ట్గా ఉన్నారంటూ మాటాలాడుకోవడం మాట వింటూనే ఉంటాం.

అయితే పాశ్చాత్య పోకడలను సిటీ అమ్మాయిలే కాదు పల్లెటూరు అమ్మాయిలు కూడా బాగా పాటిస్తున్నారు, ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇదంతా కాదు కానీ అసలు ఏం జరిగిందో చెప్పమంటారా.?

కథ లోకి వెళ్తే వరంగల్ జిల్లా లోని పర్వతగిరి మండలం లోని మోడల్ స్కూల్ హాస్టల్ లో అమ్మాయిలు ఉంటారు. ఎందుకంటే అది గర్ల్స్ హాస్టల్ కాబట్టి. అక్కడ ఉన్నట్టుండి బాత్రూంలో మరియు కొన్ని, కొన్ని చోట్ల నీరు రావడం లేదు, పోవడం లేదు. దాంతో చివరకు ప్లంబర్ తేవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్లంబర్ వచ్చి రెండు గంటల సేపు ప్రయత్నిస్తే కానీ అక్కడ విషయం ఏమిటో బయటకు రాలేదు.

పగలగొట్టి చూసినా ప్లంబర్ కి మైండ్ పోయింది. అక్కడున్న టీచర్స్, వార్డెన్స్, స్టూడెంట్స్ అందరికీ షాక్ తగిలినంత పనైంది. అసలు ఏం జరిగింది? అక్కడ ఏముంది అంటే.. మందు బాటిళ్లు, సిగరెట్ పీకలు. అవి అందులో ఇరుక్కుపోయి ఉన్నాయి. మరి అది గర్ల్స్ హాస్టల్ కదా…? ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? మరి అంత నిండిపోయే వరకు ఎవరికీ తెలియలేదు అంటే ఇది బయట వాళ్ళు చేసిన పని కాదు, హాస్టల్ లో ఉన్న వారు చేసిన పని. అప్పుడే కదా ఒకరిని ఒకరు కాపాడుకో గలరు. అయితే ఇది ఎక్కడా జరగలేదు ఒక ఒక మారుమూల పల్లెటూరిలో జరిగింది అంటే మీకు అర్ధం అయి ఉండాలి. ప్రతి దానికి సిటీ అమ్మాయిలు, సిటీ అమ్మాయిలు అని అనడం సబబు కాదేమో అని.

సిటీ అమ్మాయిలు కూడా వెనక్కి తోసి పది అడుగులు ముందున్నారు ఈ పల్లెటూరి పడుచులు, అదండీ జరిగింది. ఇది చూసిన వార్డెన్, ప్లంబర్ ఎవరిని పిలిచి అడగాలో, ఏం అర్థం చేసుకోవాలో తెలియక తికమకగ కొంచెం సిగ్గు, కొంచెం కోపం అన్ని కలగలిపి ఎవరితో ఏమీ మాట్లాడకుండా ప్లంబర్ తన పని పూర్తి చేయించుకుంటున్నారు. ఇలా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అది కూడా ఎక్కడో చూశారుగా, అందుకే మన పిల్లలను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి.