ఆ జంటకి కొత్తగా పెళ్లయింది. వారిద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ భారీ జీతాలు అందుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాతే ఇద్దరు హనీమూన్ కి వెళ్లాలనుకున్నారు.

హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకు వెళ్లడంతో ఆ భర్తతో విడాకులు కావాలని కోర్టు ఎక్కింది భార్య. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. బోపాల్ కి చెందిన మహిళకి ఓ వ్యక్తితో ఐదు నెలల క్రితం పెళ్లయింది.

పెళ్లి తర్వాత భార్యను హనీమూన్ కి గోవా తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. అందులో భాగంగా ట్రిప్పు ప్లాన్ అయితే ట్రిప్ కి ఒక రోజు ముందు భార్యకి షాక్ ఇచ్చాడు తన తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రామ మందిరం ప్రారంభానికి వెళుతున్నట్లు చెప్పాడు.

ఆ టైంలో చేసేదేమీ లేక భర్త అత్తమామలతో కలిసి అయోధ్య రామ మందిరానికి 10 రోజులు వెళ్ళింది. అప్పుడే అసలు కథ మొదలైంది. పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. అక్కడ భూపాల్ ఫ్యామిలీ కోట్లు విడాకులకి దరఖాస్తు చేసింది.

తన భర్త హనీమూన్ కి గోవా అని చెప్పి అయోధ్య తీసుకువెళ్లాడని తన కన్నా తల్లిదండ్రులకు , ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని ఆమె తన విడాకులు పిటిషన్ లో పేర్కొంది. స్వీకరించి కోర్టు జంటను పిలిపించి వారితో మాట్లాడింది. ప్రస్తుతం వారిద్దరికీ కొన్ని వారాలపాటు కౌన్సిలింగ్ ఇయ్యాలని న్యాయమూర్తి ఆదేశించారు.

https://youtu.be/cr7Ca89bMmg