ఇలా చేసి మీ గ్యాస్ టిక్ సమస్యల్ని తరిమికొట్టండి, మనం అందరము ఎప్పుడో ఒకప్పుడు, ఎసిడిటీ వలన బాధపడుతూనే ఉంటాం, ఎసిడిటీకి ఎన్నో కారణాలు ఉన్న, ముఖ్య కారణం సమయానికి ఆహారం తినకపోవడం, సరైన జీవనశైలి లేకపోవడం, మంచి పోషక ఆహారం తీసుకోకపోవడం వలన, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు వస్తూ ఉంటాయి, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, దానివలన గుండెల్లో మంటగా ఉండడం, పొట్ట బరువుగా ఉండడం కూడా జరుగుతుంది, అలాగే మల విసర్జన సరిగ్గా లేకపోయినా, గ్యాస్టిక్ ట్రబుల్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

సమయానికి భోజనం చేయలేనివారు, ఆ టైం కి కనీసం నీళ్ళు అయినా తీసుకోవాలి, ఎక్కువగా మసాలా ఉన్న ఆహారాలు, ఆయిల్స్ కి ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఇలాంటివి వస్తూ ఉంటాయి, జీర్ణ సమస్యలు లేకుండా ఉండాలి అంటే, భోజనం చేసిన తర్వాత, కొంచెం జిలకర లేదా సోంపు ని కానీ తీసుకుంటే, మంచి రిలీఫ్ వస్తుంది, కొద్దిగా చిన్న అల్లం ముక్కను తీసుకొని, కొద్దిగా ఉప్పు తో కలిపి రెగ్యులర్గా తీసుకోవడం వలన, ఎసిడిటీ గ్యాస్ లాంటి సమస్యలు తొలగిపోతాయి.

గ్యాస్ట్రిక్ ట్రబుల్ నివారణ చేందుకు, మన వంటింట్లో దొరికే దినుసులతోనే కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం, దీనికి కావలసిన పదార్థాలు జీలకర్ర, జీలకర్రను మనం నిత్యం వంటకాలలో వాడుతూ ఉంటాం, జిలకర వలన ఆ వంటకు మంచి రుచి వాసన లభిస్తుంది, దీనితోపాటు జిలకర లో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులకు, ఉపశమనం కోసం వాడుతూ ఉంటారు, ఎసిడిటీ గ్యాస్ నాలుకకు రుచి ఉండదు, రుచిని పెంచుకోడానికి బాగా ఉపయోగపడుతుంది.

ముందుగా పాన్ పెట్టుకుని, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకుందాం, దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, వేడి చేసుకోవాలి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో జీలకర్ర వేయించి, పౌడర్ చేసుకున్న పౌడర్ని, ఒక అర టీ స్పూన్ మోతాదులో వేడినీళ్లలో కలుపుకొని, రోజుకు రెండు నుండి మూడు సార్లు తీసుకోండి, ఈ వాటర్ రెగ్యులర్ గా అలా తీసుకోవడం వలన, మీకు గ్యాస్టిక్ ట్రబుల్ ఎసిడిటీ నుంచి రిలీఫ్ వస్తుంది…