సినీ పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం, సినిమాల్లో నటించాలని హీరోయిన్ అవ్వాలని, ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు. కొందరికి అదృష్టం కలిసి వచ్చి అందం నటనతో మంచి ఫామ్ లోకి వస్తారు.

మరికొందరికి అవకాశాలు రాక సినిమాలకు స్వస్తి చెప్పి, బిజినెస్ లో మునిగిపోతారు. ఇండస్ట్రీలో ఒక హిట్టు పడిందంటే చాలు, ఆ హిట్ హీరోయిన్ల రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. వరుస అవకాశాలతో పాటు రెమ్యునేషన్ కూడా బాగా భారీగా ముట్ట చెబుతూ ఉంటారు.

కానీ ఒక హీరోయిన్ మాత్రం సినిమా అవకాశాలు లేకపోయినా వేరే రంగంలోనూ దానికి దీటుగా సంపాదించవచ్చని నిరూపించారు. కోలీవుడ్ హీరోయిన్ ప్రీత విజయ్ కుమార్. ఒకప్పుడు సినిమాలలో నటించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ హీరోయిన్, ప్రియత విజయ్ కుమార్ అందరికీ సుపరిచితమే, 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు మలయాళం భాషలలోనూ నటించిన ఈమె రజినీకాంత్ కు పెద్ద కూతురుగా నటించి, మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

ఆ తర్వాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు అంటే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాల కోసం స్వస్తి పలికే 2002లో దర్శికుడు హరిని పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

అంతేకాకుండా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే, మరోపక్క బిజినెస్ లోను రాణిస్తోంది. ఈమె చెన్నై సముద్ర తీరంలోని ఉప్పండి అనే ప్రాంతంలో ప్రీతి ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దానికి సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు, ఇందులో పనిచేసే వాళ్ళందరూ మహిళలు కావడం విశేషం. ఇక మద్రాస్ లోనూ కాఫీ పెడుతూ హలో ఫ్రాన్సిస్ కూడా ఇవ్వడం జరిగింది. వీటితోపాటు స్థానిక సాలి గ్రామంలోని సినీ ఎడిటింగ్ స్టోరీలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా ప్రీత నెలకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తోంది. మరోపక్క ఈమె భర్త హరి కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్నాడు.