ప్రపంచంలో మనుషులందరూ ఒక మనస్తత్వం కలిగి ఉండరు అనేది అందరికి తెలిసిన విషయం. ఒక్కొక్కరి ఆలోచనా తీరు వారిది. అయితే మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉంటే జీవితం అందంగా, ఆనందంగా ఉంటుందో చెప్పిన వ్యక్తి చాణిక్యుడు.

ఈయన చెప్పిన విషయాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి చాణిక్యుడు చెప్పిన ఈ నాలుగు విషయాలు పాటిస్తే జీవితం అద్బుతమే! మొదటిది బార్య భర్తల విషయం.సిగ్గు పడటం అనేది ఇద్దరి మధ్య సానిత్యాన్ని తగ్గిస్తుందని,

బార్యభర్తలు ఇద్దరూ స్నేహ సంబంధం కలిగి ఉండాలని ముఖ్యంగా శృంగార విషయంలో అతిగా సిగ్గు కలిగి ఉండడం వల్ల మనసులో విషయాలు బయటకు వెల్లడించలేరని, దీనివల్ల మూడవ వ్యక్తి జోక్యం చేసుకుని అవకాశాలు ఉంటాయని వివహబందంలో అది ఎంతమాత్రం మంచిది కాదని చాణిక్యుడు తెలిపాడు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం తినేది ఏదైనా సరే దాన్ని గౌరవించాలి. అలాగే భోజనం ముందు సిగ్గు, మొహమాటం, బిడియం వంటివి ఉండకూడదు, స్నేహితులు, బంధువులు ఇలా ఎవరి ఇంటిక్కీన భోజనానికి వెళితే ఎలాంటి మొహమాటం, సిగ్గు, బిడియం వంటివి వదిలేయాలి. అప్పుడే తినే ఆహారానికి కూడా గౌరవం ఇచ్చినట్టు, అలాగే మోహమాటాల మధ్యలో సరిగా తినకుండా సగం కడుపుతో లేవడం వంటి బాధలు తప్పుతాయి.

గురు శిష్యుల మద్య సిగ్గు ఉండడం వలన చదువులో ముందుకు వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది, అలాంటి వారు జీవితంలో ఏ విషయాన్ని అవగాహన చేసుకోలేరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు అని గురు శిష్యుల మద్య సిగ్గు కాకుండా గొప్ప స్నేహబంధం ఉండాలి. ఇలా ఉండడం వల్ల గురు శిష్యుల మద్య ఎంతో అనుబంధం ఏ్పడుతుంది శిష్యుడు జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్ళడానికి మంచి మార్గం సుగమం అవుతుంది.