తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మహానటి సావిత్రి గారి సినీ ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆమెని చూసిన ప్రతి ఒక్కరికి మన ఇంటి ఆడపడుచు లాగ అనిపిస్తాది, అందుకే ఆమె పేరు చరిత్ర లో సువర్ణాక్షరాలతో అలా లిఖించబడింది, ఆమె తర్వాత అంతతి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సౌందర్య గారే అని చెప్పొచ్చు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రతి స్టార్ హీరో సరసన నటించిన ఈ మహానటి దాదాపు రెండు దశాబ్దాలపాటు నెంబర్ 1 హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక్క వెలుగు వెలిగింది,మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి జగపతి బాబు మరియు శ్రీకాంత్ వంటి హీరోల వరుకు ఎవరి పక్కన నటించిన సరైన జోడి అనిపిస్తాది ఈమె పక్కన ఉంటే,అలాంటి మహానటి దురదృష్టం కొద్దీ హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయిన సంఘటన అప్పట్లో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను శోక సంద్రంలోకి నెట్టేసిన సంగతి మన అందరికి తెలిసిందే, తెలుగు సినిమాకి ఆమె లేని లోటు ఎవ్వరు పూడవలేనిది, నేటికీ ఆ సంఘటన తల్చుకుంటే మన కంట నుండి నీళ్లు రాక తప్పదు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో కొన్ని బయటపడ్డాయి,ఇక అసలు విషయానికి వస్తే సౌందర్య అప్పట్లో తన బాల్య స్నేహితుడు రఘు అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే,అప్పట్లో వీళ్లిద్దరి ప్రేమని సౌందర్య ఇంట్లో అమ్మ నాన్న ఎవ్వరు ఒప్పుకోలేదు, కానీ రఘు కోసం వాళ్ళని సైతం ఎదిరించి పెళ్లి చేసుకుంది, ఇక ఆమె సినిమా ద్వారా ఎంతో కస్టపడి సంపాదించిన ఆస్తులను మొత్తం కూడా తన భర్త పేరు మీదనే రాసేసింది,కానీ సౌందర్య కన్ను మూసీన తర్వాత ఆమె ఆస్తిని మొత్తం అనుభవిస్తూ అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని గోవా లో స్థిరపడిపొయ్యాడు రఘు, సౌందర్య గారి తల్లి తండ్రులు తమకు చెందాల్సిన ఆస్తులని కూడా రఘు కాజేసి మమల్ని రోడ్డు పాలు చేసాడు అని కోర్టులో కేసు కూడా వేసిన సంగతి మన అందరికి తెలిసిందే,కానీ కోర్టు తీర్పుని ఇచ్చాక వాళ్లకి చెందవలసిన ఆస్తులు ఇస్తాను అని ఒప్పుకొన్న రఘు పూర్తి స్థాయిలో ఇప్పటికి ఇవ్వలేదు అనే ప్రచారం జరుగుతుంది.

సుమారు అయిదు సంవత్సరాల వరుకు సాగిన వీరిద్దరి దాంపత్య జీవితంలో వీళ్ళకి ఎలాంటి సంతానం కలుగలేదు,సౌందర్య తెలుగు సినిమాలో ఆఖరుగా నటించిన చిత్రం శ్వేతా నాగు,కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన సౌందర్య బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ వంటి వారితో ఎన్నో సినిమాల్లో నటించింది,ఒక్క మాట లో చెప్పాలి అంటే నిన్నటి తరం హీరోయిన్స్ లో శ్రీదేవి ఎలా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని సూపర్ స్టార్ గా ఏలిందో ,అదే స్థాయిలో సౌందర్య కూడా ఒక్క వెలుగు వెలిగింది అనే చెప్పాలి,చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా చిన్న పెద్ద లేకుండా ప్రతి హీరో తో నటించింది సౌందర్య,చూడడానికి అచ్చ తెలుగు అమ్మాయి లా కనిపించే సౌందర్య వాస్తవానికి కన్నడ అమ్మాయి,కన్నడ అమ్మాయి అయినా కూడా చక్కని తెలుగు మాట్లాడడం సౌందర్య గారి ప్రత్యేకత,ఏది ఏమైనా సౌందర్య చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వెలకట్టలేని లాస్ అనే చెప్పాలి.