తెలుగు బుల్లితెర మీద జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ షో ద్వారా టాలీవుడ్ కి ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి నేడు మంచి డిమాండ్ ఉన్న కమెడియన్స్ గా మారారు, అలా ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించి, టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మారిన నటుడు షకలక శంకర్, జబర్దస్త్ లో ఇతని స్కిట్స్ కి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్ఖర్లేదు, కేవలం ఈయన వేసే స్కిట్స్ కోసం జబర్దస్త్ షో ని చూసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, అలాంటి క్రేజ్ ఏర్పరచుకున్నాడు కాబట్టే ఈయన వైపు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ టాప్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలు చూసారు, దాని ఫలితమే ఆయన ఈరోజు ఇన్ని సినిమాల్లో నటించడానికి కారణం,ఈయన హీరో గా కూడా రెండు మూడు సినిమాల్లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, కానీ అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, కెరీర్ మంచి ఊపు లో పోతున్న సమయం లో హీరో గా మారి కమెడియన్ గా తనకి వస్తున్నా అవకాశాలకు తానె స్వయంగా గండి కొట్టుకున్నట్టు అయ్యింది అనే చెప్పాలి.

అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన కమెడియన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు, ఇటీవల ఆయన కమెడియన్ గా నటించిన అక్షర సినిమా విడుదల కి సిద్ధం గా ఉంది, ఈ సినిమాలో నందిత శ్వేతా టైటిల్ పాత్ర ని పోషిస్తుంది, ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ఆ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్నాడు షకలక శంకర్,ఈ ప్రొమోషన్స్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది,ఆయన మాట్లాడుతూ ‘నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేను,జబర్దస్త్ నుండి ప్రారంభం అయినా నా ప్రస్థానం నేడు నన్ను హీరో గా సినిమాలు చేసే రేంజ్ కి తీసుకెళ్లింది, కానీ నాకు కమెడియన్ గా వచ్చిన గుర్తింపు హీరో గా మాత్రం రాలేదు, దీనితో ఇటు హీరో గా అవకాశాలు తగ్గిపోయాయి, కమెడియన్ గా అవకాశాలు తగ్గిపోయాయి, ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ కమెడియన్ గా మీ ముందుకి అక్షర సినిమా తో రాబోతున్న, ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది, దయచేసి నాకు అందరూ అవకాశాలు ఇవ్వండి ప్లీజ్, నేనెంతో మళ్ళీ నిరూపించుకుంటాను’ అంటూ షకలక శంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆయన ఇంకా మాట్లాడుతూ ‘నేను మళ్ళీ కమెడియన్ గా మారడానికి ముఖ్య కారణం అలీ గారే, సినిమాల్లో హీరో గా ఆశించిన స్థాయిలో విజయం సాధించాక డీలా పడి ఏమి చెయ్యాలో తెలియక మదన పడుతున్న సమయం లో అలీ గారు ఇచ్చిన ప్రోత్సహం నేను జీవితం లో ఎప్పటికి మర్చిపోలేను,నీ కామెడీ టైమింగ్ కి లక్షల్లో అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు నిన్ను బాగా మిస్ అవుతున్నారు, మంచి కథ దొరికినప్పుడు హీరో గా చెయ్యి కానీ, కమెడియన్ గా వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు, ఉదాహరణగా నన్నే తీసుకో, నేను హీరో గా భారీ హిట్స్ కొట్టిన, ఏ రోజు కూడా నాకు కమెడియన్ గా వచ్చిన అవకాశాలు వదులుకోలేదు,అందుకే నేను ఇండస్ట్రీ లో నిలదొక్కుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటూ ఆయన చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి, ఇక నా కెరీర్ ని వృధా చేసుకోడం ఇష్టం లేక మళ్ళీ పూర్తి స్థాయి కమెడియన్ గా మారాలి అనుకున్నాను, దయచేసి మీ సినిమాల్లో మంచి పాత్రలు ఉంటె నాకు అవకాశాలు ఇవ్వండి’ అంటూ షకలక శంకర్ ఈ సందర్భంగా మాట్లాడాడు.