శివాలయంలో ఇలా ఒక్క ప్రదక్షిణ చేస్తే, పదివేల ప్రదక్షిణాలు చేసిన ఫలితం వస్తుందని పురాణంలో ఉంది. నూటికి 99 మందికి ఈ విషయం గురించి తెలియదు. దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు.

అక్కడికి వెళ్తే మనసుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలయానికి వెళ్లిన దైవాన్ని దర్శించుకోవడానికి,ముందు కచ్చితంగా ప్రదక్షిణలు చేస్తారు.

కొందరు తమ వీలును బట్టి ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే, మరి కొందరు మూడు ప్రదక్షిణాలే చాలని చెప్పి అనంతరం దైవదర్శనం కోసం వెళ్తూ ఉంటారు. ప్రదక్షిణంలో ప్రా అనే అక్షరం పాపాలకి నాశనం అని అర్థం, దా అనగా కోరికలు తీర్చమని అర్థం, కి అన్న అక్షరం మరో జన్మలో మంచి ఇవ్వమని అర్థం, నా అనగా అజ్ఞానము పారదోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని అర్థం.

గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి, విశ్వానికి ప్రదక్షణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే, విశ్వప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణం అవుతుంది. ప్రదక్షణ అంటే భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ, ధ్యానిస్తూ ఉన్నానని అర్థం. అయితే మనం వేరే ఏ దేవుడి కుడికైనా వెళ్ళినప్పుడు, అలా మన వీలును బట్టి ప్రదక్షిణములు చేయవచ్చు.

కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం అలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నారు. దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే, అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షణలో చేయకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు అంటే, దేవుళ్ళకే దేవుడు కాబట్టి, ఆయన గుడి చుట్టూ మామూలుగా ప్రదక్షిణలు చేస్తే శివుడు, ఉన్న తత్వానికి తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.