మన శరీరంలో వేడి తగ్గి, చలువ కలగాలంటే ఏమి తినాలి? ఏమి తాగాలో తెలుసుకుందాం..


వేడి లక్షణాలు: చురుకులు, పోట్లు, కళ్ళ మంటలు, ముక్కు నుండి, చెవి నుండి, వేడి ఆవిర్లు రావడం, మల మూత్రం సమయంలో మంటగా ఉండడం, ఒళ్లంతా మంటలు పుట్టడం వంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఒంట్లో వేడి తగ్గాలంటే, ఎన్నో ప్రకృతి సిద్ధమైన ఔషధాలు ఉన్నాయి.

ఆయుర్వేదం ప్రకారం వేడి అంటే జ్వరం వచ్చినట్లు ఉండడం, జలుబు, దగ్గు, ఆయాసం, మల మూత్ర సమయంలో మంట పుట్టడం, కడుపులో గ్యాస్ పెరగడం, మాటి మాటికి చిఱు చెమటలు పట్టడం, గుండెల్లో దడ, దప్పిక, కళ్ళు మంటలు పుట్టడం, కళ్ళు బోదరగా కనిపించడం, తల తిరగడం, BP పెరిగినట్లు అనిపించడం ఇవన్నీ వేడి వల్ల కలిగే లక్షణాలు.

వేడి పెరిగినప్పుడు కడుపులో మంట, గొంతులో మంట, అరికాళ్ళు, అరిచేతులు మంట, ఇలా ఒళ్లంతా మండిపోతున్నట్లు అనిపించడాన్ని వేడి చేయడం అంటారు. వేడిని అశ్రద్ధ చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో వేడి అధికమయ్యే కొద్ది జీవకణాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. రక్తహీనత, రక్తనాళాల వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంటుంది. అతి వేడి వల్ల మూత్రపిండాలు, జీర్ణాశయం, కాలేయం, వంటి ఇలాంటి సున్నిత అవయవాలు త్వరగా, దెబ్బతినే అవకాశం ఉంటుంది. మూత్రంలో మంట అలవాటుగా పదే పదే వస్తున్నట్లయితే, వెంటనే మన శరీరంలో వేడి తగ్గించుకునే ప్రయత్నం చేయటం చేయాలి..