మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. అలాంటివారు శనివారం రోజు పూజ చేస్తే చాలా మంచిది.

కాబట్టి ఆ వెంకన్న కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలంటే ఈ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయ నమః అనే నామాన్ని ఒక మూడుసార్లు మనసులో స్మరించుకోవాలి. శ్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ కోసం సిద్ధం అవ్వాలి.

ముఖ్యంగా శనివారం పూజ చేసే వాళ్ళు పూజలు కచ్చితంగా ముద్ద కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకుల అన్న చాలా ఇష్టం. శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకి ప్రతిఫలం రాదని గుర్తించుకోండి. శనివారం రోజు చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది.

మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి దేవుడి గదిని శుభ్రం చేసి, వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేయాలి. తరువాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిద లాగా చేయండి. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఇంట్లోనే కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు.

అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. నిత్య దీపారాధన చేసే వాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడడం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని చేసే డబ్బుల సమస్య నుండి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బులోటు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగే అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.