ఈ భూమి మీద ఉండే అనేక అద్భుత ఔషధ మొక్కలలో శంకు పుష్పం పూల మొక్క ఒకటి. ఈ మొక్క గురించి ఇది మనకు చేసే మేలు గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్కను తెలుగులో శంఖ పుష్పం లేదా దింతెన మొక్క లేదా గిరికర్ణిక మొక్క లేదా అపరంజిత మొక్క అంటారు.

ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. మొత్తం ప్రపంచమంతా విస్తరించాయి. ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది. ఈ చెట్లు పొలాల కంచెల వెంట రహదారులకు డొంకలకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి. ఈ పుష్పాలు కలిగిన మొక్కలను దాదాపు అందరూ చూసే ఉంటారు కానీ, ఈ మొక్క యొక్క ఉపయోగాలు చాలామందికి తెలియదు.

ఈ శంకు పుష్పం పూల మొక్కలు పూర్వం నుండి ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. అనేక రోగాలకు చికిత్సగా వాడుతున్నారు. అంతేకాదు భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాల్లో వాడతారు. మరియు శంఖ పుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్ప పూజలు ఉపయోగిస్తారు. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టాన్ని ఆ ఇంటికి కలిగిస్తుంది.

ఆ ఇంట్లో ధనానికి లోటు లేకుండా చేస్తుంది. శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తీగ మొక్క పుష్పాలు దేవతారాధనకు బాగా ఉపయోగిస్తారు. చాలామంది ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారు. ఇలా పెంచుకుంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోయి, ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని కష్టాలు తీరిపోతాయి. శంకు పుష్పాలతో పూజ చేస్తే శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి, శనేశ్వరుడి అనుగ్రహం ఆ కుటుంబం పై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంఖ పుష్పం తీరుస్తుందని కుటుంబ శ్రేయస్సు కలిగిస్తుందని నమ్మకం.

ముఖ్యంగా శంకు పుష్పం శని దేవుడితో ఉందని నమ్మకం. ఈ పువ్వు నీలం నీలం రంగులో ఉంటుంది. కొంతమంది ఎంతో డబ్బు సంపాదిస్తారు కానీ, ఆ డబ్బు అంతా నీళ్లలా ఖర్చవుతూ ఉంటుంది. అలాంటివారు సోమవారం రోజు ఐదు శంకు పుష్పాలను తీసుకుని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలపండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల సమస్య తీరుతుంది, డబ్బు కొరత ఉండదు. అలానే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మంగళవారం రోజు హనుమంతుడి పాదాల వద్ద ఈ శంఖ పుష్పాలను సమర్పించండి, పూజ చేసిన తర్వాత ఈ పువ్వును తీసుకొని గల్లా పెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ తీరుతాయి పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.