రేపే మొదటి పుష్య శనివారం, పుష్యమాసంలో వచ్చే శనివారాలంటే వెంకటేశ్వర స్వామికి, మరియు శనిదేవుడికి చాలా ఇష్టం. పైగా ఇదే రోజు శ్రవణా నక్షత్రం కలిసి వచ్చింది.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శనివారము, జన్మనక్షత్రం కలిసి రావడం చాలా అరుదు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. స్వామివారి అనుగ్రహం ఈజీగా లభిస్తుంది.

ఏడుకొండలవాడు జన్మించిన నక్షత్రం శ్రవణా నక్షత్రం ఈ శ్రవణా నక్షత్రం ప్రతి నెలలో వస్తుంది, కానీ శనివారంతో కూడి వచ్చే శ్రవణా నక్షత్రాలు చాలా అరుదుగా వస్తాయి. రేపు విదియ తిధి రోజున శనివారము శ్రవణా నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈరోజు తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలలో, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కనుక ఈరోజు గుడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటే చాలా మంచిది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది.అది కూడా చేయలేని వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ పువ్వు పెడితే చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. స్వామివారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెబుతున్నారు.

మరి ఏ శనివారం శ్రవణా నక్షత్రం కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు, ఏ పువ్వు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి పటానికి మందార పువ్వులు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు, దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఎందుకంటే మందార పూలు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. దాదాపు అందరూ ఇల్లు దగ్గర మందార పూలు ఉంటాయి, కనుక అందరూ కూడా ఎంతో సులువుగా మందార పూలతో పూజ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.