వెంకటేష్..కెరీర్ మొదట్లోనే మంచి హిట్స్ అందుకున్నాడు. అమెరికా నుంచి వచ్చినా కూడా ఎమోషనల్, ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు వెంకీ. అయితే అప్పటికే అన్నయ్య సురేష్ బాబు నిర్మాతగా రానిస్తుండడంతో నువ్వైనా హీరోగా రావాలని తండ్రి కోరడంతో మొదట్లో అయిష్టంగానే ఎంట్రీ ఇచ్చాడు.

అప్పటి హీరోలు చాలా వరకు ఫిట్నెస్ విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఒక విదంగా వెంకటేష్ మాత్రమే బాడీ పెంచి పవర్ఫుల్ కనిపించి బిగ్ స్క్రీన్ పై హీట్ పెంచేవారు. మెల్లగా లవ్ స్టోరీల నుంచి బలమైన మాస్ సినిమాల వరకు వచ్చారు.

ఒకవైపు చంటి, రాజా లాంటి సెన్సిటివ్ సినిమాలు చేస్తూనే మరోవైపు గణేష్, జయం మనేదేరా వంటి హై వోల్టేజ్ సినిమాలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఇక మెల్లగా తన రెమ్యునరేషన్ డోస్ ను పెంచుకుంటూ వెళ్లిన వెంకటేష్ వచ్చిన దాంట్లో సగం దాచుకుంటూ మరో సగం రియల్ ఎస్టేట్స్ లలో ఇన్వెస్ట్ చేసేవారు.అన్నయ్య సురేష్ బాబు అలాంటి బిజినెస్ లలో ఎప్పుడో రాటు దేలారు.

ఆయన అండతోనే లాభాలు వచ్చే ప్రతి బిజినెస్ లలో పాట్నర్ గా బిజినెస్ చేసుకుంటూ వచ్చారట. ఇక మెల్లగా వెంకటేష్ ఆస్తి విలువ వేల కోట్లకు దాటినట్లు టాక్. ఇప్పటివరకు చూసుకుంటే వెంకటేష్ మొత్తం ఆస్తుల విలువ 2వేల కోట్లకు పైగానే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. అంటే ఆ ఆస్తులతో పోలిస్తే వెంకటేష్ కు వచ్చే రెమ్యునరేషన్ చిల్లరతో సమానమని చెప్పవచ్చు.