ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి వరుణ్ తేజ్ లావణ్య, త్రిపాఠిల పెళ్లి హడావుడిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి, ఈ ఏడాది జూన్లో కేవలం తమ కుటుంబ సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.

ఇక ఈరోజు అనగా నవంబర్ 1న తమ కుటుంబ సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుపుకుంటున్నారు .ప్రస్తుతం అక్కడ వారి పెళ్లి సందడి జోరుగా సాగుతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఒకరు తర్వాత ఒకరు ఇటలీకి వెళ్లడానికి ఏర్పోర్ట్ లో కనిపించిన దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన భార్య అన్నా లేసినావాతో, ఎయిర్పోర్టులో ఇటలీకి వెళుతున్నట్లు వీడియో వైరల్ అవ్వగా, అదే చూసే పవన్ అభిమానులు మురిసిపోయారు. మెగా ఫ్యామిలీలో ఏదైనా వేడుక జరిగితే చాలు, అందరి దృష్టి పవన్ కళ్యాణ్ నిన్నే ఉంటుంది.

మామూలుగా పవన్ ఫంక్షన్ లో చాలా తక్కువగా కనిపిస్తారు. అయితే ఇప్పుడు తన అన్న కొడుకు పెళ్లి అని పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో వెళ్ల పవన్ కి సంబంధించిన ఫొటోస్ కోసం, ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు పవన్ ది పెద్ద చేయి కాబట్టి ఆయన వరుణ్ లావణ్య పెళ్లిలో గిఫ్ట్ ఇవ్వనున్నాడు, అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

అయితే ఎంగేజ్మెంట్ రోజున పవన్ వరుణ్ కి ఖరీదైన వాచి ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఇక ఈసారి తమ కోడలు లావణ్య త్రిపాటికి కోసం బాగా విలువ చేసే గిఫ్ట్ తీసుకువెళ్లినట్లు తెలిసింది. తన భార్య అన్నా లేసినోవా సెలెక్ట్ చేసిన గోల్డ్ నక్లెస్ గిఫ్టుగా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ నక్లెస్ ధర వచ్చేసి కోటి రూపాయలని టాక్ వచ్చింది. మొత్తానికి పవన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడని తెలుస్తోంది. ఇక పవన్ ప్రస్తుతం రాజకీయ పరంగా సినిమా పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే, అయినా కూడా అన్న కొడుకు పెళ్లి కోసం అన్ని వదులుకొని ఫ్యామిలీతో ఇటలీకి వెళ్ళాడు. ఇక పెళ్లయిన మూడు రోజులకి మెగా ఫ్యామిలీ హైదరాబాద్ కి చేరుకొని, అక్కడ గ్రాండ్గా రిసెప్షన్ చేయనున్నట్లు.

https://youtu.be/Gel3z0XXejk