టాలీవుడ్ ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాతో పాటుగా మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్’ అనే సినిమా రీమేక్ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్‌ను ఓ ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నాడు.

ఈ రెండింటిలో ముందుగా మ‌ల‌యాళ రీమేకే ముందుగా పూర్త‌వుతుంది. ఇందులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు జోడీగా సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా అనుకున్నారు. ముందు సాయిప‌ల్ల‌వి చూస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డానికి వీలు కాక‌పోవ‌డంతో ఆమె సింపుల్‌గా నో చెప్పేసింది.

దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్ వెతుకులాట‌లో ప‌డ్డారు. ఇప్పుడు వారి అన్వేష‌ణ ఫ‌లించింద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో జోడీ క‌ట్ట‌డానికి నిత్యామీన‌న్ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

నిత్యామీన‌న్‌.. తెలుగులో న‌టించి చాలా కాల‌మే అయ్యింది. అయితే ఇప్పుడు న‌టిస్తున్నా చాలా పెద్ద హీరోతో న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇదే సినిమాలో రానా ద‌గ్గుబాటి కూడా హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రానా జోడీగా ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తుంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బిల్లా రంగా అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఉండే అహం వ‌ల్ల ఓ చిన్న స‌మ‌స్య ఎంత వ‌ర‌కు దారి తీసింద‌నే ఓ పాయింట్ మీద ఈ సినిమాను తెర‌కెక్కించారు. శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో వేసిన ఓ పోలీస్ స్టేష‌న్ సెట్‌.. ఓ విలేజ్ సెట్‌లో నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. మ‌ల‌యాళంలో బిజు మీన‌న్ చేసిన పాత్ర‌ను తెలుగులో ప‌వ‌న్ చేస్తుండ‌గా, పృథ్వీరాజ్ పాత్రలో రానా క‌నిపించ‌బోతున్నాడు. ఈ ఏడాదిలోనే, ముఖ్యంగా సెప్టెంబ‌ర్ 9నే ఈ సినిమాను విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లాన్ చేశార‌ట‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.