పడుకోవటం , లేవటం, తినటం, తిరగటం, మళ్లీ పడుకోవటం! జీవితం అంటే ఇంతేనా? ఇంతే అయితే మనిషి జంతువుగా మారిపోతాడు. మనిషి లేచింది మొదలు పడుకునే దాకా విద్యా, ఉద్యోగం, సంపద, సంతోషం, పెళ్లి, సంతానం… ఇలా ఎన్నిటి గురించో తాపత్రయపడుతుంటాడు. వాట్ని తీర్చుకోవటం కోసం కష్టపడుతుంటాడు. కానీ, కొందరికి అన్ని కోరికలు చకచకా తీరిపోతాయి. కొందరు మాత్రం చతికిల పడుతుంటారు. ఎందుకని? మనిషి పూర్వజన్మ కర్మ ఫలం వల్ల కలగిన పాపం, పుణ్యం ఈ జన్మలో ఫలితాలు ఇస్తుంటాయని నమ్ముతారు హిందువులు. అందుకే, పెద్దలు కుజ దోషం, కాల్ప సర్ప దోషం వంటివి చెప్పారు. ఇవన్నీ గత పాపల వల్లే ప్రాప్తిస్తుంటాయి.

ఆ దోషాల వల్ల అనేక సమస్యలు ఏర్పడి మనః శాంతి లోపిస్తుంది. చివరకు, మనిషి జీవితంలో అతి ముఖ్యమైన రెండు అంశాలు లోపిస్తాయి. అవే… ఆరోగ్యం, విజయం! ఈ రెండూ లేకపోతే ఎన్ని వున్నా, లేకున్నా ఒక్కటే! మనిషి ఆరోగ్యంగా వుండకుంటే ఎంత ఆస్తిపాస్తులు, ఎన్ని సుఖాలున్నా ఆస్వాదించలేడు. ఇక పదే పదే ఓటములు ఎదురై ఏదీ కలిసిరాకపోతే కూడా డీలా పడిపోతాడు. జీవితం నిస్సారంగా తోస్తుంది. మరి ఆరోగ్యం, విజయం అందించే పరిష్కారం ఏంటి? మనిషి జీవితాన్ని మంచి ఫలితాల దిశగా మరల్చే ఎన్నో అద్భుత పరిష్కారాలు గ్రంథాల్లో వున్నాయి. అయితే, కుజ దోషం, సర్ప దోషాల వంటివి కూడా అణిచిపెట్టి మనకు ఆరోగ్యం, విజయం అందించే అతి సులవైన ఉపాయం ఒక్కటి మాత్రం అందరూ తప్పక తెలుసుకోవాలి. ఇది దోషాలున్నవారు, లేని వారు అందరూ చేయాలి. ఎన్నో గొప్ప ఫలితాలు తప్పక సిద్ధిస్తాయి..

మీరు రాత్రి పడుకునే ముందు ఒక శుభ్రమైన రాగి చెంబు తీసుకోండి. అందులో ఏడు చుక్కల తేనె వేయండి. ఇక ఆ తరువాత ఏదైనా ఒక చిన్న బంగారు ముక్కని ఆ నీళ్లలో వేయండి. నిత్యం వాడని బంగారమై వుండాలి. ఉంగారం లాంటివి వేసినా ఫర్వాలేదు. కానీ, తేనె నీళ్లలో వేసే ఆ బంగారం మరెక్కడా వాడకూడదు. అలా తేనే, బంగారంతో కలిసిన నీరు రాత్రంతా మీ తల వద్దే వుండాలి. రాగి చెంబుకి రాగితోనే తయారు చేసిన మూతని పెట్టండి. తెల్లవారుఝామున లేచిన తరువాత రాగి చెంబులోని నీటిలోంచి బంగారాన్ని తీసేయండి. తేనె నీళ్లని గటగటా తాగేయండి. పరిగడుపున … బ్రష్ కూడా చేయకుండానే… ఈ నీరు తాగాలి. రాత్రంతా నోళ్లో ఊరిన లాలా జలం ఉదయం కడుపులోకి పోవటం ఎంతో మంచిదని సైన్స్ కూడా చెబుతోంది. కాబట్టి నిస్సంకోచంగా తేనే నీళ్లు తాగేసేయండి. తరువాత దైవ స్మరణ చేసుకుని మంచం దిగి కాలకృత్యాల్లో పడండి!

ఉదయం లేవగానే ఇలా చేయటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే, అంతకంటే ఆశ్చర్యకరంగా రోజంతా మీరు చేపట్టిన పనులు గతంలో కంటే సులవుగా పూర్తవుతాయి. మీ జీవితంలోకి విజయం స్పష్టంగా తొంగి చూస్తుంది!