లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ పేదరికం రానేరాదు. ఈ మాటలను మంచిగా అర్థం చేసుకుని విశ్వసించినట్లయితే, పేదరికం రాని రాదు.

సంతోషకరమైన జీవితం వస్తుంది మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇక తెలుసుకుందాం. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు.

మీరు ఈ భూమ్మీదే అందమైన స్త్రీ లాగా ఉన్నారు. నిజం చెప్పండి ఎవరు మీరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవులు అలా అడగ్గానే లక్ష్మీదేవి తనను పరిచయం చేస్తుంది. గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది, ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టత్వం జరుగుతుంది.

హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపే తింటూ ఉన్నారు. ముసలి వాళ్ళను గౌరవించడం మర్చిపోతూ ఉన్నారు. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్ర హీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటూ ఉన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు.

ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు. మూగజీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేసాను అని చెప్పింది లక్ష్మీదేవి. నన్ను వదిలేయడం వల్లనే రాక్షసులు నాశనం అయ్యారని దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖ భోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది లోకులు నేను చెంచుర స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.