లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. పెళ్లిళ్లకు కానీ గురువులకు గాని, చాలా గొప్ప విద్వాంసులకు కానీ, ఇంట్లో ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు గాని, వెండిని ఇవ్వకూడదు. ఎందుకంటే వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు, వెండికి బదులు బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అయితే ఈ రోజుల్లో చాలామంది పెళ్లిళ్లకు, పేరంటాలకు, పుట్టిన రోజుల్లో, బారసాల, చేసేటప్పుడు శుభ కార్యాలు జరిగినప్పుడు, వెండి వస్తువులను బహుమతులుగా ఇస్తున్నారు కానీ, అలా ఇవ్వడం మంచిది కాదు.

అయితే బంగారం ఇవ్వండి బంగారం ఇచ్చే అంత స్థోమత లేదు అంటే హిరణ్యమునకు ప్రత్యామ్నాయంగా, ఒక రూపాయి కాసు పెట్టి ఇవ్వవచ్చు తప్పేమీ లేదు కానీ, వెండి వస్తువులను మాత్రం ఇవ్వకూడదు. వెండి అనేది పితృ దేవతలకు మాత్రమే అభ్యున్నతికి కలిగిస్తుంది, అందుకే యజ్ఞ యాగాది క్రతువులు చేసిన వారికి, ఎట్టి పరిస్థితుల్లోనూ వెండి సంబంధితమైన వస్తువులను ఇవ్వకూడదని, వేదం చెబుతుంది కనుక, వెండి వస్తువులను ఎప్పుడూ కూడా బహూకరించ వద్దు బహుమతిగా ఇవ్వాలి, అనుకునే అన్నిటికంటే శ్రేష్ఠమైనది బంగారం, రెండవది బక్క ద్రవ్యం, మూడవది వస్త్రం, ఎవరికైనా సరే వస్త్రాలను బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే, అంచు ఉన్న బట్టలను మాత్రమే ఇవ్వాలి, అంచు ఉన్న బట్టలు మీరు ఇచ్చిన తర్వాత, దానిని పుచ్చుకునే మీకు అక్షింతలు వేస్తే ఆయుర్దాయం, కారకం అని గుర్తు. అంటే బట్టలు ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి ఇద్దరికీ ఆయుర్దాయం కలుగుతుంది.

అలాగే వస్త్రాలను బహుమతిగా ఇచ్చేటప్పుడు కచ్చితంగా ఎడమ భుజం మీద ఉత్తరీయం అంటే టవల్ ఉండాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం లేకుండా బట్టలు పెడితే, నిన్ను శత్రువులు గా భావిస్తూ ఉన్నారు అని గుర్తు. ఇలా ఎడమ భుజం మీద ఉత్తరీయం లేకుండా, బట్టలు పుచ్చుకుంటే ఆరునెలల్లో మారకం వస్తుంది. అందుకే ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్న వారి దగ్గర నుండే బట్టలు పుచ్చుకోవాలి. ఒకవేళ అవతలి వారికి తెలియక ఎడమ భుజం మీద ఉత్తరీయం లేకుండా బట్టలు ఇచ్చారు అనుకోండి ,కనీసం తీసుకునే వారైనా ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి. ఒకవేళ అలా బట్టలు తీసుకునేటప్పుడు, మీ దగ్గర ఉత్తర లేకపోతే ఉత్తరీయం లేకపోతే కనీసం లో, కనీసం జేబులో ఉండే రుమాలును అయినా సరే, లేదా టవల్ అయినా సరే, తీసి ఎడమ భుజం మీద వేసుకోవాలి….