ఈరోజు మనం ఇండియన్ రైల్వేస్ లోనే ఒక మంచిపని చేసిన ఓ మనిషి గురించి చెప్పాపోతున్నాను. ముజాఫర్పూర్ ,బంద్రా ఆవద్ ఎక్ష్ప్రెస్స్ S5 కోచ్ లో ప్రయాణిస్తున్న ఆదర్శ్ శ్రీవాస్తవ అనే ప్యాసింజర్ రైలు ఎక్కి ప్రయాణిస్తున్న సమయంలో తన పాటికి తాను ఒక బుక్కుతీసుకొని చదువుకుంటున్నాడు. అలా అతను చదువుకుంటున్న కానీ తన దృష్టాంతా వేరే చోట ఉంది. కారణం అదే భోగిలో తన ఎదురుగ కూర్చున్న బాలిక ఏడుస్తా కనపడ్డారు. అక్కడ 26 మంది బాలికలు ఉన్నారు.

ఆ 26 మందిని ఇద్దరు పెద్దవాళ్ళు అదమాయిస్తూన్నారు. ఏది గామా నించి ఆదర్శ్ శ్రీవాస్తవ కు వారిపై అనుమానం వచ్చింది. ఎవ్వరికి అనుమానం రాకుండా 55 ఏళ్ళ వయసున్న ఇద్దరు వ్యక్తులు అందరి మీద పెత్తనం చేస్తుంటే ఆదర్శ్ కు ఎందుకో అనుమానం వచ్చింది. ఏదేదో తేడాగా ఉండే అనుకోని.. ఒకవేళ ఏమైనా కిడ్నాప్ వ్యవహారమేమో అని అతనికి బలంగా అనిపించింది . తన అనుమానాన్ని ఏమాత్రం పైకి కనపడ కుండా తన చేతిలోని మొబైల్ ఫోన్ ని వాడుతూ తాను చూస్తున్న బాలికల పరిస్థితి క్లుప్తంగా వివరిస్తూ దయచేసి వెంటనే స్పందించా వలసిందిగా సాక్షాత్తు రైల్వే మంత్రికి ట్విట్ చేసాడు.

ఆ ట్విట్ తో వెంటనే అప్రమత్తమైన రైల్వే శాఖ రైల్వే అధికారులకు, పోలీస్ లకు వెంటనే హుటాహుటిగా సమాచారం అందించారు. సాధారణ బట్టలు వేసుకున్న ఇద్దరు జవానులు బాలికలు ఉన్న భోగీ లోకి ఎక్కారు. వారు ఆ పిల్లను అదమాయిస్తున్న ఆ ఇద్దరు పెద్దవాళ్ళను గమనించ సాగారు. ఆ ఇద్దరు జవానులు ఆ పెద్దవాళ్ళ తో మాటలు కలిపి సమాచారాన్ని సేకరించారు. నార్కత్ గ్యాంగ్ నుండి ఈద్గాల ప్రాంతానికి ఆ బాలికలను తరలిస్తున్నట్టు తెలుసుకున్నారు.

వెంటనే అప్రమత్తమైన ఆ జవాన్లు ఆ ట్రైన్ తరువాత ఆగే స్టేషన్ లోని రైల్వే పోలీస్ లకు సమాచారాన్ని ఇచ్చారు. ఆ తరువాత రైల్ ఆగిన స్టేషన్ లో బాలిక లందరిని దింపివేసి ఆ ఇద్దరు పెద్ద వాళ్ళని పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఆ ట్విట్ చేసిన ఆదర్శ్ ను రైల్వే పోలీస్ లు ఎంతగానో అభినందించారు. బాలిక లందరు వారి జీవితాన్ని బుగ్గిపాలు పోకుండా చేసినందుకు ఆదర్శ్ కు ఎంతో కృతజ్ఞత లు తెలుపు కున్నారు.

ప్రస్తుతం ఆ బాలిక లందరిని శిశు సంక్షేమ కేంద్రా నికి పోలీస్ లు తరలించారు. బాలిక లిచిన సమాచారం మేరకు వారి కుటుంబ సబ్యులకు వారిని అప్పగించారు. సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్న ఈ వార్తను చూసి ఆదర్శ్ శ్రీవాస్తవును ప్రశంసిస్తున్నారు.