రథసప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు, ఈ రోజు జిల్లేడు వాకులను రేగిపళ్ళను ఉపయోగించి ఎలా స్నానం చేస్తే, ఏడు జన్మల పాపాలు మరియు రోగాలు నశిస్తాయో, ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం.

రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు ఆకులను, ఏడు రేగు పండ్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. అలాంటి వారికి 7 జన్మలో పాపాలు పోతాయి. అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు. ఆ పాపాలన్నీ పాట పంచలవుతాయి.

ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మజన్మంతరాల్లోనూ చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలన్నీ ఈరోజుతో హరించుకు పోతాయి.

అసలు జిల్లేడు ఆకులను రేగి పండ్లను తలపై, పెట్టుకొని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చేయాలో, చాలామందికి తెలియదు. దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే, మీరు ఆశ్చర్యపోతారు దాని గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం.

జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని, ప్రాణ శక్తిని అధికంగా గ్రహించి నిల్వవంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకుల్ని మన వంటిపై అంటే శిరస్సుపై, పెట్టుకుని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ శక్తి, నేలలోని విద్యుత్ శక్తి కలిసి శరీరం పై ఆరోగ్యం పైప్రభావాన్ని, చూపిస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…