రేపే పుత్ర గణపతి వ్రతం, బుధవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు, పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్షంలో చవితి తిధినాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే, పుత్ర సంతానం కలుగుతుందని

వరాహ పురాణం చెప్తోంది. వినాయక చవితి అనగా భాద్రపదాశుద్ధ చవితి నుండి 6 నెలల కాలంలో తిరిగి, ఈ పాల్గుణ శుద్ధ చవితి నాడు ఆకాశంలో వినాయక నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే, ఉదయిస్తాయి.ఆ రోజు గణపతిని పూజించే వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

వినాయక చవితి లాగానే ఆచరించుకుని ఈ పుత్ర గణపతి వ్రతాన్ని, పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు ఆయన కొడుకు పుట్టడం కోసం, రాజులు ఆచరించే వారిని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో, గజ ముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య, జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చుండబెట్టుకుని,

దేవతలకు దర్శనం ఇచ్చారు. అలా దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ స్తుతించారు. అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో, వారి వంశము వృద్ధిని పొందగలదని వరాన్ని అనుగ్రహించింది. ఇది వరాహ పురాణంలోని వృత్తాంతం. అయితే ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు, ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను తింటే ఇంటికి దరిద్రం పడుతుంది.

జ్ఞానం నశించిపోతుంది , హరించుకుపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు కష్టాల పాలవుతారని గణపతి ఆగ్రహానికి గురి అవుతారని పెద్దలు చెబుతున్నారు. దొండకాయ కూరను వండకూడదు అనే కాదు పచ్చడి ఫ్రై ఇలా ఏ రూపంలోనూ కూడా ఈ రోజు దొండకాయను తినకూడదు. చాలామందికి తెలియక ఈరోజు దొండకాయ కూర వండుకుని తినేస్తారు, కానీ దాని వలన తర్వాత భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తారు. మాంసం కూడా తినకూడదు. దొండకాయ నాన్వెజ్ ఈ రెండిటిని ఈరోజు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ముట్టుకోకూడదు తినకూడదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి….