రేపు శనివారం తులసి చెట్టు కింద మట్టి చిటికెడు తీసి, ఇలా చేస్తే చాలు ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, మీకు ఉన్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా పోతాయి,

బాధలు కన్నీళ్లు పోతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోతాయి ధన ఆదాయం పెరుగుతుంది. మీరే మీ ఆదాయం పెరగడాన్ని చూస్తారు. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది మన హైందవ సాంప్రదాయంలో, తులసికి ఉన్న ప్రాధాన్యత మరే ఇతర మొక్కకు లేదు.

తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీమహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల, సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది.

అంతే కాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో, తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల, ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థ స్థలం అని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని, పెద్దలు చెబుతూ ఉన్నారు. రోజు నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం ప్రదక్షిణలు చేయడం వల్ల, సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని అందులోనే తీర్థాలను క్షేత్రాలను, దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.