ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో, 250 గ్రామ్స్ దాల్చిన చెక్క వేసి చిన్న చిన్నగా విరగొట్టుకోండి. కాసేపు రోస్ట్ అయ్యాక 250 గ్రామస్ యాలకులను వేసి, ఒక నిమిషం పాటు కలుపుకోండి.

తర్వాత 150 గ్రాముల బ్లాక్ కాడ మామ్ వేసి, మళ్ళీ ఒక నిమిషం పాటు కలపండి. మరో 150 గ్రాముల స్టార్ ఎనీ ఆడ్ చేసి నాన్ స్టాప్ గా కలుపుతూ, తర్వాత 150 గ్రాముల లవంగాలను వేసి, స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూనే ఉండండి.

రెండు నిమిషాల పాటు స్పైసెస్ కలిపి రోస్ట్ చేసుకున్న తర్వాత, 70 గ్రాముల ఎండుమిరపకాయలు వేసి, మళ్ళీ నిమిషం పాటు కలుపుకొని, 50 గ్రాములు డ్రై జింజర్ అంటే సొంటిని వేసుకోండి కలపండి. తర్వాత దన్యాలని 400 గ్రాములు వేసి నాన్ స్టాప్ గా స్టౌ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి, ధన్యాలు మాడకుండా రెండు మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి.

రెండు మూడు నిమిషాల తర్వాత ఒక 30 గ్రాముల జావిత్రి వేసి, ఒక 20 పీసుల జాపత్రి కాయలను వేసి, మళ్లీ రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. 250 గ్రాముల జీలకర్రని వేసుకోండి మళ్లీ కలుపుకోండి. ఈ మొత్తం ప్రాసెస్ స్టౌ హై ఫ్లేమ్ లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకంటే అలా చేయడం వల్ల మసాలాలు మాడిపోయి చికెన్ మసాలా ఫ్లేవర్ మొత్తం పాడవుతుంది. అందుకనే స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేయండి.తర్వాత 50 గ్రాముల బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు వేసి కలుపుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్.

తర్వాత కలుపుకొని ఒక 10 ,15 బగారాకులను వేసి మళ్లీ కలుపుకొని, తర్వాత 100 గ్రామ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోండి. ఆనియన్స్ గుమగుమలాడిపోయే స్వీట్ నెస్ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. ఈ మసాలా ఫ్లేవర్ ఈ బ్రౌన్ ఆనియన్స్ వల్ల ఇది ఎవరికి తెలియదు. మీరు కూడా ఒకసారి బ్రౌన్ ఆనియన్స్ వేసి ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్ గా ఒక కప్పు పుదీనా ఆకులను చల్లుకోండి, చాలామంది పుదీనాకు బదులు కరివేపాకు వెలిసి వేసి రోస్ట్ చేస్తారు. పుదీనా ఆకులు ఎందుకు వేశాను అంటే బ్రౌన్ ఆనియన్స్ వేసి మసాలా ప్రాసెసింగ్ రోస్ట్ చేశాను కాబట్టి, ఆనియన్స్ కి కాంబినేషన్ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్పైసెస్ మొత్తం ఒక నిమిషం పాటు కలుపుకుంటే, కొంచెం రోస్ట్ అయ్యి మగ్గినట్లు తెలుస్తుంది. అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. దీనిని చికెన్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది..