అయోధ్య రాముడి విగ్రహాన్ని చెక్కిన అరుణ్యోగి రాజ్, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రతిష్టించిన సమయంలో చూస్తే అసలు ఆ విగ్రహాన్ని చెక్కింది, తానేనా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు.

అలంకరణ తర్వాత అంతా ఆ రామయ్య విగ్రహానికి అంత అందం వస్తుందని, ఊహించలేదని అన్నాడు. ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఏదో, తెలియని అందం అందులోకి వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత బాల రాముడి విగ్రహం రూపురేఖలు మారిపోయాయి.

అసలు తయారు చేసింది నేనేనా అని నాకు అనుమానం వచ్చింది. అలంకరణ తర్వాత రామయ్య స్వరూపమే మారిపోయింది. చెక్కుతున్న సమయంలోనే ఒక్కో దశలో ఒక్కో విధంగా కనిపించింది కానీ, ఆభరణాలతో అలంకరించిన తర్వాత మొత్తం రూపు రేఖలు మారిపోయాయి. నిజానికి ప్రాణ ప్రతిష్టకు ముందు బాల రాముడి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో కాస్త వివాదం తలెత్తినప్పటికీ, రాముడి ముఖం చూసిన వాళ్లంతా తన్మయత్వంతో మునిగిపోయారు.

ఎంత బాగుందో అని శిల్పిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా కల్లు పెదాలని చాలా శ్రద్ధతో చెక్కా డని ప్రశంసిస్తున్నారు. దీనిపైనే అరుణ్ణి ప్రశ్నిస్తే అంతా రాముడి దయ ఆయన ఆదేశించాడు, నేను చెక్కుకుంటూ పోయాను. అంతే అని నవ్వుతూ సమాధానం ఇస్తున్నాడు, ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు దాదాపు 7 నెలలు శ్రమించినట్లు చెప్పాడు. ఈ ఏడు నెలల సమయం తనకి ఒక సవాలుగా మారిందని వివరించాడు. శిల్ప శాసనానికి తగ్గట్టుగా చెప్పడంతో పాటు, ఐదేళ్ల రాముడిగా కనిపించడం చాలా కనిపించేలా చెక్కడం ఛాలెంజింగ్ అనిపించిందని చెప్పాడు.

బాల రాముడి విగ్రహం చెక్కిన సమయంలో ఆయన కళ్ళ గురించి నాకు కాస్త భయం ఉండేది. అందుకే కళ్ళు బాగున్నాయా అని మా ఫ్రెండ్స్ ని పదేపదే అడిగా వాడిని రాయిలో అలా ఆ భావాన్ని తీసుకురావడం, అంత సులభమైన విషయం కాదు. చాలా సమయం వెచ్చించాలి అందుకే చిన్న పిల్లలు ఎలా ఉంటారు, గమనించి అదే పసితనం రాముడు విగ్రహంలో కనిపించేలా చూసుకున్నాను. ఇదంతా రాముడు దయతోనే జరిగింది ఎన్నో విగ్రహాలు చెక్కినప్పటికీ, అయోధ్య రాముడి విగ్రహం చెక్కే అదృష్టం తనకే దక్కడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు. నిజానికి ప్రాణం ప్రతిష్టకి ముందు రాముడిలా విగ్రహ ఫోటోలు బయటకు వచ్చాయి, కానీ 22వ తారీకు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత తెర తొలగించారు, అప్పుడే తొలి దర్శనం ఇచ్చాడు. అయోధ్య రాముడు సోషల్ మీడియా అంతటా ఫోటోలే కనిపిస్తున్న వందల ఏళ్ల కల నెరవేరింది అంటూ షేర్ చేస్తున్నారు.

https://youtu.be/UlT7823Nqyo