పెరుగు వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియంతో దంతాలు, ఎముకలు, దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే పెరుగన్నాన్ని చాలా మంది మూడు పూటలా ఆరగిస్తారు. అయితే రాత్రి పూట పెరుగు అన్నం తినవచ్చా..? లేదా..? అనే సందేహం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రాత్రి పూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు, జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని, చెబుతారు. రాత్రివేళ పెరుగు తినరాదు, అనే విషయాన్ని ఎందుకు చెబుతారు? ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది. అయితే పెరుగును రాత్రి పూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనితో కఫం వస్తుంది, తరచూ జలుబు, దగ్గు, సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు పెరుగన్నం ఆరగించకుండా ఉండడమే ఉత్తమం. దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు లేని వారు రాత్రివేళ పెరుగుతో అన్నం తినవచ్చు. అయితే పెరుగుతో భోజనం చేసిన వెంటనే పడుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇప్పుడు చెప్పుకున్నట్లు పెరుగుకు చల్లబరిచే గుణం ఉంది. అంటే ఇది జీర్ణక్రియను నెమ్మదింప చేస్తుంది. భోజనం జీర్ణం అయ్యే ఎప్పుడు వేడి పుడుతుంది, దానిని పెరుగు చల్లబరచడం వల్ల స్లోగా అరుగుదల నడుస్తుంది. పెరుగుతో అన్నం తినాల్సి వస్తే పడుకోవడానికి కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇక దగ్గు, జలుబు, సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు, దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.

https://youtu.be/JHIrR6XsZxw?t=20